News November 24, 2024
నేతలకు కలిసొస్తున్న ‘జైలు’ సెంటిమెంట్!
ఝార్ఖండ్ JMM చీఫ్ హేమంత్ సోరెన్ అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికలు జరగగా రాష్ట్ర ప్రజలు మరోసారి ఆయనకే అధికారం కట్టబెట్టారు. గత పదేళ్లలో జగన్, CBN, రేవంత్ వంటి నేతలూ జైలుకు వెళ్లి వచ్చాక CM అయ్యారు. దీంతో ఈ సెంటిమెంట్ నేతలకు కలిసి వస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలో ఢిల్లీ ఎన్నికలు జరగనుండగా కేజ్రీవాల్ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుందంటున్నారు.
Similar News
News November 24, 2024
గవర్నర్‌ను కలవనున్న హేమంత్ సోరెన్
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈరోజు గవర్నర్‌ను కలవనున్నారు. ఆయన పార్టీ JMM స్పష్టమైన మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. నవంబర్ 26న ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన ఈరోజు గవర్నర్ సంతోష్ గంగ్వార్‌తో భేటీ కానున్నారు. కాగా ఈ ఎన్నికల్లో 81 అసెంబ్లీ స్థానాలకు గానూ JMM కూటమి 56 చోట్ల గెలిచింది.
News November 24, 2024
IPLలో RTM అర్థం ఇదే..
ఈరోజు 3.30PM మొదలయ్యే IPL మెగా వేలం కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలువురు క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. ఈరోజు కొందర్ని RTM చేసుకునే అవకాశం ఉంది. RTM అంటే రైట్ టూ మ్యాచ్. ఉదా.పంత్‌ను రూ.20కోట్లకు CSK పాడితే అదే ధర చెల్లించి పాత జట్టు DC తీసుకోవచ్చు. అయితే ఫుల్ కోటా(6) రిటెన్షన్ వాడుకోవడంతో KKR, RR ఈ RTM వాడుకునే అవకాశం లేదు.
News November 24, 2024
ఫ్లోర్ లీడర్‌గా అజిత్ పవార్ ఏకగ్రీవ ఎన్నిక
ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్ పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన 41 మంది పార్టీ ఎమ్మెల్యేలు అజిత్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. బీజేపీ, శివసేన శాసనసభాపక్ష సమావేశాలు కూడా ఈరోజే జరిగే అవకాశం ఉంది. ఈ నెల 26లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉండడంతో సీఎం అభ్యర్థి ఎంపికపై కూటమి పార్టీలు త్వరితగతిన కసరత్తు చేస్తున్నాయి.