News November 24, 2024
గవాస్కర్ సరసన యశస్వీ జైస్వాల్
ఆసీస్‌తో తొలి టెస్టులో సెంచరీ బాది టీమ్ ఇండియా బ్యాటర్ యశస్వీ జైస్వాల్ రికార్డులు సాధించారు. 23 ఏళ్లకే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఐదో భారత బ్యాటర్‌గా ఆయన నిలిచారు. ఇప్పటివరకు జైస్వాల్ 4 సెంచరీలు బాదారు. ఈ క్రమంలో గవాస్కర్ (4) రికార్డును సమం చేశారు. అలాగే 23 ఏళ్లకే ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 3 సెంచరీలు బాదిన ఐదో భారత క్రికెటర్‌గానూ నిలిచారు. గవాస్కర్, కాంబ్లీ ఒకే ఏడాదిలో 4 సెంచరీలు చేశారు.
Similar News
News November 24, 2024
విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీ చేశారు. 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఆయన ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. కాగా 13 ఇన్నింగ్స్‌ల తర్వాత విరాట్ అర్ధ సెంచరీ చేయడం విశేషం. ప్రస్తుతం భారత్ స్కోర్ 384/5గా ఉంది. క్రీజులో కోహ్లీతోపాటు వాషింగ్టన్ సుందర్ (18*) ఉన్నారు.
News November 24, 2024
నేనూ NCC క్యాడెట్‌నే: PM మోదీ
తాను కూడా NCC క్యాడెట్ అని ప్రధాని మోదీ తెలిపారు. ఆదివారం NCC దినోత్సవం సందర్భంగా ఈ అంశాన్ని ఆయన మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. ‘ఈరోజు చాలా ప్రత్యేకమైనది. నేడు NCC దినోత్సవం. ఈ పేరు వినగానే మనకు స్కూల్, కాలేజీ రోజులు గుర్తుకొస్తాయి. నేనూ NCC క్యాడెట్‌నే. NCCలో అనుభవం నాకు అమూల్యమైనదని పూర్తి విశ్వాసంతో చెప్పగలను. NCC యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా భావాన్ని పెంపొందిస్తుంద’ని పేర్కొన్నారు.
News November 24, 2024
విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటం: జగన్
AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా కూటమి సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. విద్యార్థులపై చంద్రబాబు కక్షగట్టారని ఆయన విమర్శించారు. ‘అమ్మఒడి, ఇంగ్లిష్ మీడియం, టోఫెల్, ట్యాబులు, బైజూస్ కంటెంట్, నాడు-నేడును బాబు రద్దు చేశాడు. వైసీపీ హయాంలో తల్లుల ఖాతాలకే వసతి, విద్యా దీవెన జమ చేసేవాళ్లం. ఇప్పుడు అది కూడా లేకుండాపోయింది’ అని ఆయన ఫైర్ అయ్యారు.