News November 24, 2024
త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైళ్లు
భారత్‌లో మొదటి హైడ్రోజన్ రైలు డిసెంబర్‌లో పట్టాలెక్కనుంది. ఈ పర్యావరణ అనుకూల రైలును హరియాణాలో 90KM దూరం కలిగిన జింద్-సోనిపట్ మధ్య నడపనున్నారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకొని నీటి ఆవిరిని విడుదల చేయడం దీని ప్రత్యేకత. ఇతర రైళ్లతో పోలిస్తే ఇవి తక్కువ శబ్దంతో నడుస్తాయి. 2025 నాటికి ఇలాంటి 35 రైళ్లను పట్టాలెక్కించడానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.
Similar News
News November 24, 2024
మోదీకి అదానీ, జగన్ అనుకూలం: నారాయణ
AP: ముడుపుల వ్యవహారంలో అదానీపై అమెరికాలో కేసు నమోదైనందున ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి అదానీ, మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. రూ.1,750 కోట్ల ముడుపులు ఇచ్చి రూ.లక్ష కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని విమర్శించారు. దీనిపై దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరారు.
News November 24, 2024
పట్టు బిగించిన భారత్.. ఆసీస్ 12/3
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులకే 3 వికెట్లు కూల్చేసింది. బుమ్రా 2 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. విజయం కోసం ఆసీస్ ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 487/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
News November 24, 2024
పోలవరం, స్టీల్‌ప్లాంట్‌పై చర్చించాలని కోరాం: శ్రీకృష్ణదేవరాయలు
AP: విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన సంస్థల గురించి పార్లమెంట్‌లో చర్చించాలని కేంద్రాన్ని కోరినట్లు టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అఖిలపక్ష భేటీ అనంతరం మాట్లాడుతూ ‘పోలవరం, కడప స్టీల్ ప్లాంట్, ఆయిల్ రిఫైనరీ గురించి వెల్లడించాలని కోరాం. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం, నగరాల్లో వరదలు వచ్చినప్పుడు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించాలని ప్రస్తావించాం’ అని పేర్కొన్నారు.