News November 24, 2024
లీగల్ నోటీసులు పంపిన ఏఆర్ రెహమాన్
తన భార్యతో విడాకులపై తప్పుడు ప్రచారం చేస్తున్న మాధ్యమాలకు మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ లీగల్ నోటీసులు పంపారు. తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని అభ్యంతరకరమైన కంటెంట్‌ను వ్యాప్తి చేసిన వారు 24 గంట్లలోపు వాటిని తొలగించాలన్నారు. రెహమాన్‌తో కలిసి పనిచేసిన బాసిస్ట్ మోహినిడే కూడా తన భర్తతో విడాకులు తీసుకోవడంతో వీరిద్దరూ కలుస్తున్నట్టు వార్తలొచ్చాయి.
Similar News
News November 28, 2024
ఘోరం: ప్రియురాలిని చంపి 50 ముక్కలు చేసి..
ఝార్ఖండ్‌కు చెందిన నరేశ్ చెన్నైలో ఓ యువతితో సహజీవనం చేస్తూ సొంతూరు వెళ్లి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనను పెళ్లి చేసుకుని, ఇంటికి తీసుకెళ్లాలంటూ ప్రియురాలు ఒత్తిడి తేవడంతో ఆమెను హత్య చేశాడు. పదునైన ఆయుధాలతో శరీరాన్ని 50 ముక్కలు చేసి అడవిలో పారేసి పరారయ్యాడు. ఓ కుక్క యువతి శరీర భాగంతో తిరగడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు చికెన్ షాపులో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
News November 28, 2024
ఉక్రెయిన్‌కు మరిన్ని US ఆయుధాలు
జనవరిలో తన పదవీ విరమణకు ముందే ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేయడానికి US అధ్యక్షుడు బైడెన్ నిర్ణయించారు. రష్యాతో యుద్ధం చేస్తోన్న ఆ దేశానికి $725 మిలియన్ల విలువైన ఆయుధాలను పంపనున్నారు. ఇందులో యాంటీ ట్యాంక్ వెపన్స్, ల్యాండ్ మైన్స్, డ్రోన్స్, స్టింగర్ మిస్సైల్స్, హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ కోసం అవసరమైన సామగ్రి ఉన్నట్లు సమాచారం. త్వరలోనే US కాంగ్రెస్ ఆమోదం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
News November 28, 2024
‘ప్రత్యేక హోదా’పై మౌఖిక హామీ మాత్రమే ఇచ్చాం: కేంద్రం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై రాతపూర్వక హామీ ఇవ్వలేదని, మౌఖికంగా మాత్రమే చెప్పామని కేంద్రం హైకోర్టుకు నివేదించింది. దీంతో ఈ విషయంలో తామెలా జోక్యం చేసుకుంటామని పిటిషనర్ కేఏ పాల్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఇది ప్రభుత్వాల పరిధిలోని వ్యవహారమని స్పష్టం చేసింది. ఏపీకి హోదా ఇవ్వకుంటే ఎలా నష్టం జరుగుతుందో తెలియజేయాలని పాల్‌ను ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది.