News November 24, 2024
డిసెంబర్‌లో మోగనున్న పెళ్లి బాజాలు

డిసెంబర్(మార్గశిర)లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నెలలో బలమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు, సిద్ధాంతులు చెబుతున్నారు. డిసెంబర్ 4, 5, 6, 7, 10, 11, 14, 20, 22, 24, 25 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఇక జనవరిలో మంచి ముహూర్తాలు లేవు. జనవరి 31 నుంచి మార్చి 4 వరకు మాఘమాసంలో ముహూర్తాలు ఉన్నాయి.
Similar News
News January 19, 2026
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.
News January 19, 2026
PPP విధానంలో ఆర్టీసీ బస్టాండ్ల అభివృద్ధి

AP: రాష్ట్రంలోని ప్రధాన RTC బస్టాండ్లను PPP విధానంలో ₹958 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆటోనగర్ (విజయవాడ), గుంటూరు, కర్నూలు, మద్దిలపాలెం (విశాఖ), చిత్తూరు బస్టాండ్ల విస్తరణ, ఆధునికీకరణ చేయనున్నారు. తిరుపతి బస్టాండ్ అభివృద్ధి పనులు కేంద్ర సహకారంతో ఇప్పటికే ప్రారంభం అయ్యాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ప్రైవేటు సంస్థలు ముందుకు రాగానే ఇతర బస్టాండ్ల పనులూ చేపడతారు.
News January 19, 2026
చిన్న గ్రామం.. 100 మంది డాక్టర్లు

ఒక చిన్న గ్రామం దేశానికి 100 మంది డాక్టర్లను అందించింది. బిహార్ పాట్నాకు 55KMల దూరంలోని అమ్హారా గ్రామం ‘విలేజ్ ఆఫ్ డాక్టర్స్’గా పేరుపొందింది. సమాజ సేవ కోసమే ఇక్కడ చాలామంది డాక్టర్ చదువుతున్నారు. ఈ గ్రామానికి చెందిన సీనియర్ డాక్టర్లు రెగ్యులర్‌గా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తారు. విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తారు. వారిని ఆదర్శంగా తీసుకుని గ్రామంలో మరింతమంది మెడిసిన్ చదవడానికి ఆసక్తి చూపుతున్నారు.


