News November 24, 2024
ముస్లిం ఏరియాలో BJP విజయం.. కారణమిదే!
దేశమంతా మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల గురించి మాట్లాడుతుంటే UPలో మాత్రం కుందర్కీ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. 61% ఓట్లున్న ఈ స్థానంలో 31ఏళ్ల తర్వాత BJP అభ్యర్థి రాంవీర్ సింగ్ 1,44,791 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ మొత్తం 12 మంది పోటీ చేస్తే అందులో 11 మంది ముస్లింలుండటం గమనార్హం. కాగా గత MLAపై అసంతృప్తి, కమ్యూనిటీలో అంతర్గత కలహాలు, ఓట్ల చీలికల వల్ల రాంవీర్‌కు విజయం దక్కిందని తెలుస్తోంది.
Similar News
News November 24, 2024
భర్త ఆత్మహత్యను వీడియో రికార్డు చేసిన భార్య
భర్త(29) ఆత్మహత్య చేసుకుంటుండగా నిలువరించాల్సింది పోయి ఆ ఘటనను ఫోన్లో రికార్డు చేసిన భార్య(29)పై మహారాష్ట్ర థానే పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యాభర్తలిద్దరూ నిత్యం గొడవపడేవారు. ఈ క్రమంలో నవంబర్ 20న ఉరివేసుకొని భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉండి భర్తను కాపాడకుండా భార్య వీడియో రికార్డు చేసింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు భార్యపై కేసు నమోదు చేశారు.
News November 24, 2024
‘ఫార్మాసిటీ’ గెజిట్‌ను రద్దు చేయండి: హరీశ్‌రావు
TG: లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటుచేస్తున్నట్లు జులై 19న గెజిట్ విడుదల చేసి ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ అని సీఎం రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. వెంటనే పాత గెజిట్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. సీఎం లగచర్లకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడాలని, పోలీసులను ప్రయోగిస్తే కుదరదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి తర్వాతైనా కాంగ్రెస్ తీరు మార్చుకోవాలని సూచించారు.
News November 24, 2024
IPL: రిషభ్ పంత్‌కు రూ.27 కోట్లు
అందరూ అనుకున్నట్లుగానే రిషభ్ పంత్ అదరగొట్టారు. ఈ యువ సంచలనాన్ని రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. RTM పద్ధతిలో ఢిల్లీ దక్కించుకునేందుకు ప్రయత్నించినా లక్నో తగ్గలేదు. IPL చరిత్రలో ఇదే అత్యధిక ధర. ఇదే వేలంలో శ్రేయస్ అయ్యర్ రూ.26.75 కోట్లు పలకగా ఆ రికార్డును పంత్ బద్దలుకొట్టారు.