News November 24, 2024
గ్రేటర్ హైదరాబాద్‌లో హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు

హుమయూన్‌నగర్‌లోని తెలంగాణ మైనార్టీ పాఠశాల బాలుర -1ను ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్‌లోని వంటగది, భోజనశాల, స్టోర్‌రూమ్, పడకగదులు, ప్రొవిజన్స్, హాస్టల్ రిజస్టర్‌లను పరిశీలించారు. పిల్లలతో కలసి ఆయన టిఫిన్ చేశారు. టిఫిన్స్ ఎలా ఉన్నాయని విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నిర్వహణ బాగుందని ఆయన ప్రశంసించారు.
Similar News
News November 14, 2025
జూబ్లీ బైపోల్: కాంగ్రెస్ LEADను టచ్ చేయని BJP!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో BJPకి వచ్చిన ఓట్లు ఆ పార్టీ శ్రేణులను నిరాశలో పడేశాయి. పోస్టల్ బ్యాలెట్‌లో 20 ఓట్లు రాగా.. 10 రౌండ్లు ముగిసేసరికి లంకల దీపక్ రెడ్డి డిపాజిట్ గల్లంతైంది. మొత్తం పోలైన ఓట్లలో 8.76 శాతంతో 17,061 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 50.83 శాతంతో 98,988 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి మీద 24,729 ఓట్ల తేడాతో గెలుపొందారు. కనీసం INC LEAD ఓట్లు కూడా BJPకి రాకపోవడం గమనార్హం.
News November 14, 2025
జూబ్లీహిల్స్‌లో BRSకు తగ్గిన ఓట్లు!

గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే BRSకు ఈసారి ఓట్లు తగ్గాయి. 2014లో అప్పటి TRS అభ్యర్థి రాములు ముదిరాజ్‌కు 18,436 ఓట్లు రాగా 2018లో TRS అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు 68,979 ఓట్లు వచ్చాయి. 2023లో BRSఅభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు 80,550 ఓట్లు రాగా ఈ ఉపఎన్నికలో మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. అంటే గత ఎన్నికతో పోల్చితే 6,291 ఓట్లు తక్కువగా వచ్చాయి. మైనార్టీలు కాంగ్రెస్ వైపు మళ్లడమే ప్రధాన కారణమని టాక్.
News November 14, 2025
జూబ్లీహిల్స్‌లో పాటకే పరిమితమైన దేఖ్‌లేంగే!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ‘దేఖ్‌లేంగే’ అంటూ కార్యకర్తలను ఉర్రూతలూగించిన పాటలు ఓట్లు రాబట్టలేదు. బస్తీవాసులను పెద్దగా ప్రభావితం చేయలేదు. సైలెంట్ ఓటింగ్ తమకే సొంతం అనుకున్న BRSకు జూబ్లీ ప్రజలు ఝలక్ ఇచ్చారు. ప్రతి రౌండ్‌లో నవీన్ యాదవ్‌కు జై కొట్టారు. తొలి రౌండ్‌లో 47 ఓట్లతో మొదలైన లీడింగ్ 10వ రౌండ్‌లో 24,729 వేలకు చేరడం విశేషం. అడ్డదారిలో గెలిచారని మరో వైపు BRS నేతలు వాదిస్తున్నారు.


