News November 24, 2024
రెండు రాష్ట్రాల్లో DBTలు పనిచేశాయి
MH, ఝార్ఖండ్ ఎన్నికల్లో అధికార పార్టీలు గెలవడం వెనుక DBT పథకాలు పనిచేసినట్టు స్పష్టమవుతోంది. MHలో లడ్కీ బెహెన్, ఝార్ఖండ్‌లో CM మయ్యా సమ్మాన్ యోజన పథకాల ద్వారా మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం ఫలితాలపై ప్రభావం చూపింది. పైగా ప్రస్తుతం ఇస్తున్న ₹1,500ను ₹2,100కు పెంచుతామని మహాయుతి ప్రకటించింది. అలాగే ₹1000 సాయాన్ని ₹2,500కు పెంచుతామని హేమంత్ సోరెన్ హామీ ఇవ్వడం కలిసొచ్చింది.
Similar News
News November 24, 2024
అర్ష్‌దీప్ సింగ్‌కు రూ.18 కోట్లు
భారత స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను పంజాబ్ తిరిగి సొంతం చేసుకుంది. బేస్ ప్రైస్ రూ.2 కోట్లు ఉండగా రూ.18 కోట్లకు RTM పద్ధతిలో పంజాబ్ కొనుగోలు చేసింది. ఇతడి కోసం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, SRH పోటీ పడ్డాయి. గతంలో ఇతడు పంజాబ్ కింగ్స్ తరఫునే ఆడారు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడం సింగ్ స్పెషాలిటీ.
News November 24, 2024
STAY TUNED: IPL వేలం ప్రారంభం
సౌదీలోని జెడ్డాలో IPL వేలం ప్రారంభమైంది. తమ అభిమాన క్రికెటర్ ఏ టీమ్‌లోకి వెళతాడు? ఎన్ని రూ.కోట్లు కొల్లగొడతాడు? అనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఆక్షన్‌లో మొత్తం 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. StarSports ఛానల్, JioCinemaలో LIVE ప్రారంభమైంది. రేపు కూడా వేలం కొనసాగనుంది.
News November 24, 2024
మోదీకి అదానీ, జగన్ అనుకూలం: నారాయణ
AP: ముడుపుల వ్యవహారంలో అదానీపై అమెరికాలో కేసు నమోదైనందున ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి అదానీ, మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. రూ.1,750 కోట్ల ముడుపులు ఇచ్చి రూ.లక్ష కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని విమర్శించారు. దీనిపై దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరారు.