News November 24, 2024
KCR స్ఫూర్తితో ఈనెల 29న దీక్షా దివస్: KTR
తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిర్బంధాలు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయని, మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘2009 నవంబర్ 29న KCR దీక్ష చేపట్టారు. ఇప్పుడు మళ్లీ ఆయన స్ఫూర్తితో అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో దీక్షా దివస్ నిర్వహిస్తాం. అదేరోజు నిమ్స్‌లో అన్నదానం చేస్తాం. డిసెంబర్ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లికి ప్రణమిల్లే కార్యక్రమం చేపడతాం’ అని KTR తెలిపారు.
Similar News
News November 24, 2024
RTMలో జాక్ మెక్‌గర్క్‌కు రూ.9కోట్లు
విధ్వంసకర ఓపెనర్ బ్యాటర్ జాక్ మెక్‌గర్క్‌ను ఢిల్లీ రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఇతని కోసం పంజాబ్, ఢిల్లీ పోటీ పడ్డాయి. RTM విధానంలో ఢిల్లీ మెక్‌గర్క్‌ను సొంతం చేసుకుంది. ఓపెనర్‌గా వచ్చి ఇతను భారీ హిట్లు కొట్టగలరు.
News November 24, 2024
రాజ్యాంగం డాక్యుమెంట్ కాదు.. ఓ ప్రయాణం: కిరణ్ రిజిజు
ప్రధాని మోదీ రాజ్యాంగ పరిరక్షకుడని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కొనియాడారు. రాజ్యాంగం అంటే ఒక స్థిరమైన డాక్యుమెంట్ కాదని, అదొక ప్రయాణమని తెలిపారు. దానికి అనేక సవరణలు జరిగాయని పేర్కొన్నారు. ‘రాజ్యాంగం గురించి చెప్పడం ఒక నిమిషంలో సాధ్యం కాదు. దాని ప్రాథమిక సిద్ధాంతాలను మనం టచ్ చేయలేం. కానీ మన ప్రజాస్వామ్య దేశంలో ఏదీ పర్మినెంట్ కాదు’ అని చెప్పారు. ఈ నెల 26న రాజ్యాంగదినోత్సవం నిర్వహిస్తామన్నారు.
News November 24, 2024
మార్క్‌రమ్‌ను వదిలేసిన సన్‌రైజర్స్
SRH మాజీ కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు బిడ్ వేసి సొంతం చేసుకుంది. గత కొన్ని సీజన్లుగా తమ జట్టులో ఉన్న మార్క్‌రమ్‌ను తిరిగి కొనుగోలు చేసేందుకు సన్‌రైజర్స్ ఆసక్తి చూపించలేదు. దక్షిణాఫ్రికా టీ20లీగ్‌లో SRH సిస్టర్ ఫ్రాంచైజీ ఈస్టర్న్ కేప్‌కు ఐడెన్ కెప్టెన్‌గా రెండుసార్లు కప్ అందించడం గమనార్హం.