News November 24, 2024
రాణించిన రాహుల్.. అతియా పోస్ట్ వైరల్
కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతం అవుతున్న కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు 77 రన్స్ చేశారు. దీంతో రాహుల్ భార్య అతియా శెట్టి ఇన్‌స్టాలో పెట్టిన స్టోరీ వైరల్ అవుతోంది. ‘ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోడు.. వెనక్కి తగ్గడు’ అని ఆమె క్యాప్షన్ ఇచ్చారు. కాగా రాహుల్, అతియా త్వరలోనే పేరెంట్స్ కానున్నారు. వచ్చే ఏడాది తాము బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఇటీవల వారు ప్రకటించారు.
Similar News
News November 24, 2024
రవిచంద్రన్ అశ్విన్‌కు భారీ ధర.. ఎంతంటే?
స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను రూ.9.75కోట్లతో CSK సొంతం చేసుకుంది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో ఇతను ఆక్షన్‌లోకి రాగా చెన్నై, రాజస్థాన్ పోటీ పడ్డాయి. ఐపీఎల్ కెరీర్‌లో 212 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 180 వికెట్లు తీశారు. ఎకానమీ 7.1గా ఉంది. చెన్నై పిచ్‌లో అశ్విన్ రాణించగలడన్న విశ్వాసంతో CSK ఇంత ధర పెట్టినట్లు తెలుస్తోంది.
News November 24, 2024
రచిన్ రవీంద్రను తిరిగి దక్కించుకున్న చెన్నై
ఓపెనింగ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను CSK రూ.4కోట్లకు కొనుగోలు చేసింది. బేస్ ప్రైజ్ రూ.1.50 కోట్లతో వేలంలోకి వచ్చిన ఇతడి కోసం పంజాబ్, చెన్నై పోటీ పడ్డాయి. గత సీజన్లో చెన్నై తరఫున ఆడిన ఇతను 161 స్ట్రైక్ రేట్‌తో 222 పరుగులు చేశారు.
News November 24, 2024
SRHకు హర్షల్ పటేల్.. రూ.8కోట్లు
పేస్ బౌలర్ హర్షల్ పటేల్‌ను SRH రూ.8కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో పంజాబ్ తరఫున ఆడిన ఇతను రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చారు. ఐపీఎల్ కెరీర్లో హర్షల్ పటేల్ 8.7 ఎకానమీతో 135 వికెట్లు తీశారు. ఇతని బెస్ట్ 4-25. డెత్ ఓవర్లలో ఇతను వేరియేషన్లతో బ్యాటర్లను ఇబ్బంది పెడతారు.