News November 24, 2024
నాగచైతన్య-శోభిత పెళ్లి స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖుల వివాహ వేడుకల స్ట్రీమింగ్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. వచ్చే నెలలో ఒక్కటి కానున్న నాగచైతన్య, శోభిత దూళిపాళ వివాహం స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రూ.50 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. కాగా ఈ జోడీ అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో డిసెంబర్ 4న వివాహం చేసుకోనుంది.
Similar News
News November 24, 2024
హ్యారీ బ్రూక్‌కు రూ.6.25కోట్లు
హార్డ్ హిట్టర్ హ్యారీ బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో ఢిల్లీ తరఫున ఆడిన ఇతను రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చారు. చెన్నై, పంజాబ్, ఢిల్లీ బ్రూక్ కోసం పోటీ పడ్డాయి. ఐపీఎల్‌లో ఇతను 190 రన్స్ చేయగా, 123 స్ట్రైక్ రేట్ ఉంది.
News November 24, 2024
బలపడిన అల్పపీడనం.. 27 నుంచి భారీ వర్షాలు
AP: ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడిందని APSDMA వెల్లడించింది. ఇది రేపు వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఆ తర్వాత వాయవ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు కదులుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 27 నుంచి 30 వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
News November 24, 2024
IPLలో రికార్డ్ ధరలు.. ఇద్దరూ ఇండియన్సే!
రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ IPL-2025 వేలంలో రికార్డు ధర పలికారు. పంత్‌ను లక్నో రూ.27 కోట్లు, అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. లీగ్ చరిత్రలో అత్యధిక ధర పలికిన వీరిద్దరూ టీమ్‌ఇండియా బ్యాటర్లు కావడం విశేషం. మొన్నటి వరకు స్టార్క్ రూ.24.75 కోట్లతో ఖరీదైన ప్లేయర్‌గా ఉన్నారు. ఇండియన్ లీగ్‌లో ఇతర దేశాల ప్లేయర్లకు భారీగా వెచ్చించడం పట్ల గతంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.