News November 24, 2024
జగన్ వల్లే ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం: యనమల
AP: అదానీతో సోలార్ పవర్ ఒప్పందాల విషయంలో మాజీ సీఎం జగన్ క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్ అవినీతి వల్లే ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం పడుతోందన్నారు. తాము కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం చేసుకున్నట్లు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.
Similar News
News November 24, 2024
మార్క్‌రమ్‌ను వదిలేసిన సన్‌రైజర్స్
SRH మాజీ కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు బిడ్ వేసి సొంతం చేసుకుంది. గత కొన్ని సీజన్లుగా తమ జట్టులో ఉన్న మార్క్‌రమ్‌ను తిరిగి కొనుగోలు చేసేందుకు సన్‌రైజర్స్ ఆసక్తి చూపించలేదు. దక్షిణాఫ్రికా టీ20లీగ్‌లో SRH సిస్టర్ ఫ్రాంచైజీ ఈస్టర్న్ కేప్‌కు ఐడెన్ కెప్టెన్‌గా రెండుసార్లు కప్ అందించడం గమనార్హం.
News November 24, 2024
చెన్నైకి రాహుల్ త్రిపాఠి
రాహుల్ త్రిపాఠిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.3.40కోట్లకు కొనుగోలు చేసింది. ఇతను రూ.75లక్షల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లోకి వచ్చారు. త్రిపాఠి గత సీజన్లో SRH తరఫున ఆడారు. టాప్ ఆర్డర్లో త్రిపాఠి బిగ్ హిట్స్ కొట్టగలరు.
News November 24, 2024
కాన్వేకు రూ.6.25కోట్లు
న్యూజిలాండ్ బ్యాటర్ కాన్వేను రూ.6.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వచ్చిన ఇతడిని తీసుకోవడానికి చెన్నై, పంజాబ్ పోటీ పడ్డాయి. ఇతను గత సీజన్లో చెన్నై తరఫున ఆడగా, రిటైన్ చేసుకోలేదు. కాన్వే ఓపెనింగ్ బ్యాటర్.