News November 24, 2024
పోలవరం, స్టీల్‌ప్లాంట్‌పై చర్చించాలని కోరాం: శ్రీకృష్ణదేవరాయలు
AP: విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన సంస్థల గురించి పార్లమెంట్‌లో చర్చించాలని కేంద్రాన్ని కోరినట్లు టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అఖిలపక్ష భేటీ అనంతరం మాట్లాడుతూ ‘పోలవరం, కడప స్టీల్ ప్లాంట్, ఆయిల్ రిఫైనరీ గురించి వెల్లడించాలని కోరాం. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం, నగరాల్లో వరదలు వచ్చినప్పుడు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించాలని ప్రస్తావించాం’ అని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2024
స్టార్ బౌలర్‌ను కొన్న ముంబై ఇండియన్స్
IPL: వేలంలో లేటుగా ఎంట్రీ ఇచ్చిన ముంబై స్టార్ బౌలర్ బౌల్ట్‌ను సొంతం చేసుకుంది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ ఉన్న అతడిని రూ.12.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ న్యూజిలాండ్ పేసర్ IPLలో 103 మ్యాచులు ఆడి 121 వికెట్లు పడగొట్టారు. గతంలో ముంబై, రాజస్థాన్ తరఫున ఆడారు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బతీయడం ఇతడికి వెన్నతో పెట్టిన విద్య. MIలో బుమ్రాకు బౌల్ట్ తోడవడంతో బౌలింగ్ స్ట్రాంగ్ అయింది.
News November 24, 2024
నట్టూకు రూ.10.75 కోట్లు
IPL మెగా వేలంలో పేసర్ నటరాజన్ మంచి ధర పలికారు. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ ఉన్న అతడిని రూ.10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇతడు IPLలో 61 మ్యాచులు ఆడి 67 వికెట్లు తీశారు. యార్కర్లు, స్లో బాల్స్‌తో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో నట్టూ స్పెషలిస్ట్.
News November 24, 2024
పాక్‌కు షాక్.. తొలి వన్డేలో జింబాబ్వే గెలుపు
జింబాబ్వే టూర్ వెళ్లిన పాక్‌కు షాక్ తగిలింది. తొలి వన్డేలో 80పరుగుల తేడాతో ఓడింది. జింబాబ్వే తొలుత 40.2 ఓవర్లకు 205 రన్స్ చేసి ఆలౌటైంది. పాకిస్థాన్ 21 ఓవర్లకు 60/6 వద్ద ఉండగా వర్షం పడటంతో మ్యాచ్ నిలిపేశారు. ఆపై వాతావరణం ఆటకు అనుకూలించలేదు. 21 ఓవర్ల వద్ద జింబాబ్వే 125/7 స్థితిలో ఉండటంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం గెలుపును నిర్ణయించారు. 39రన్స్ చేసి 2వికెట్లు తీసిన సికందర్ రజా POMగా నిలిచారు.