News November 24, 2024

పట్టు బిగించిన భారత్.. ఆసీస్ 12/3

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులకే 3 వికెట్లు కూల్చేసింది. బుమ్రా 2 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. విజయం కోసం ఆసీస్ ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 487/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 19, 2026

బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

image

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

News January 19, 2026

వరిలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

image

వరి నారుమడి దశలో కాండం తొలిచే పురుగును గుర్తిస్తే నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు లేదా 600 గ్రా. ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలి. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న, పిలకదశలో ఉన్న వరిపైరులో తప్పకుండా ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలు 10KGలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8KGలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4G గుళికలు 4kgలను 20-25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలి.

News January 19, 2026

‘ధురంధర్’ విలన్ రోల్.. నో చెప్పిన నాగార్జున!

image

రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం కొనసాగిస్తోంది. ఈ మూవీలో విలన్ రోల్ కోసం ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునను సంప్రదించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అయితే పాత్ర నచ్చినా అప్పటికే కూలీ, కుబేర సినిమాల్లో నటిస్తుండటంతో డేట్స్‌ను అడ్జస్ట్ చేయలేక నాగ్ ఆఫర్‌ను తిరస్కరించారని పేర్కొన్నాయి. దీంతో చివరకు అక్షయ్ ఖన్నాను సెలక్ట్ చేశారని వెల్లడించాయి.