News November 24, 2024

అర్ష్‌దీప్ సింగ్‌కు రూ.18 కోట్లు

image

భారత స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను పంజాబ్ తిరిగి సొంతం చేసుకుంది. బేస్ ప్రైస్ రూ.2 కోట్లు ఉండగా రూ.18 కోట్లకు RTM పద్ధతిలో పంజాబ్ కొనుగోలు చేసింది. ఇతడి కోసం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, SRH పోటీ పడ్డాయి. గతంలో ఇతడు పంజాబ్ కింగ్స్ తరఫునే ఆడారు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడం సింగ్ స్పెషాలిటీ.

Similar News

News November 24, 2024

ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు: శరద్ పవార్

image

మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి విజయంపై NCP(SP) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. లాడ్కీ బహీణ్ పథకం, మతపరమైన విభజనలు, మహిళలు పెద్దఎత్తున పోలింగ్‌లో పాల్గొనడం ఆ కూటమి గెలుపునకు దోహదం చేసి ఉండొచ్చన్నారు. తాము గెలుపుకోసం మరింత కష్టపడాల్సిందని చెప్పారు. ఫలితాలు తాము అనుకున్నట్లు రాలేదని, వీటిపై అధ్యయనం చేసి ప్రజల్లోకి వెళ్తామని పేర్కొన్నారు.

News November 24, 2024

క్రికెట్ ప్రపంచం జైస్వాల్ కాళ్ల వద్ద ఉంది: గవాస్కర్

image

భారత ఓపెనింగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. క్రికెట్ ప్రపంచం అతడి పాదాల వద్ద ఉందంటూ కొనియాడారు. ‘ఈ కుర్రాడు చాలా స్పెషల్. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నాడు. సెంచరీ పూర్తైతే 150, 200 రన్స్ కొట్టాలని చూస్తాడు. ప్రపంచంలో ఏ దేశపు బౌలర్లకైనా చుక్కలు చూపిస్తాడు. ఈరోజు అతడి ఆటతీరే అందుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.

News November 24, 2024

PIC OF THE DAY

image

ఒకప్పుడు ఉప్పు, నిప్పులా ఉన్న విరాట్, గంభీర్ టీమ్ ఇండియా కోసం కలిసిపోయిన సంగతి తెలిసిందే. ఈరోజు పెర్త్ టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ భావోద్వేగానికి లోనయ్యారు. విరాట్‌ను హత్తుకుని అభినందించారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని టీమ్ ఇండియా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. మ్యాచ్‌లో విరాట్ 143 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.