News November 24, 2024

MBNR: దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జీలుగా మన జిల్లా నాయకులు

image

ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జీలుగా మహబూబ్ నగర్ నేతలను నియమించారు. వికారాబాద్ జిల్లా ఇన్‌ఛార్జిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి, కామారెడ్డి జిల్లాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నల్గొండ జిల్లాకు MBNR మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ బండ ప్రకాష్ లను నియమించింది.

Similar News

News November 24, 2024

MBNR: 29న దీక్షా దివస్, వైస్ ఇన్‌ఛార్జిల నియామకం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నవంబర్ 29న దీక్షా దివస్ కార్యక్రమం ఏర్పాటు చేయనున్న సందర్భంగా ఆయా జిల్లాలకు వైస్ ఇన్‌ఛార్జి లాను బీఆర్ఎస్ నియమించింది. MBNR జిల్లాకు కేమ మల్లేష్, NRPT ఎమ్మెల్సీ కోటి రెడ్డి, GDWL మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ రెడ్డి, WNP మాజీ జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, NGKLకు మాజీ ఎమ్మెల్సీ విజయ సింహ రెడ్డిలను నియమించారు.

News November 24, 2024

ఈ నెల 30న మహబూబ్‌నగర్‌కు సీఎం రేవంత్

image

ఈ నెల 30వ తేదీన మహబూబ్‌నగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరయ్యారు. మంత్రి జూపల్లి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు జిల్లా అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు.

News November 24, 2024

MBNR: చివరి దశకు సర్వే.. కుటుంబాలు ఎన్నంటే!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే చివరి దశకు చేరింది. మొత్తం MBNR-2,41,853, NGKL-2,50,596, GDWL-1,67,886, NRPT-1,55,999, WNPT-1,54,793 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 నుంచి 180 ఇళ్లు కేటాయించారు. ఈ నెల 27 వరకు సమగ్ర సర్వే 100% పూర్తి చేస్తామని ఆయా జిల్లాల అధికారులు తెలిపారు.