News November 24, 2024
అదరగొట్టిన అయ్యర్.. IPL చరిత్రలో అత్యధిక ధర
టీమ్ ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ వేలంలో అదరగొట్టారు. బేస్ ప్రైస్ రూ.2 కోట్లు ఉండగా రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఇతడి కోసం ఢిల్లీ, పంజాబ్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. అయ్యర్ 2024 సీజన్లో KKRను విజేతగా నిలిపారు. కాగా, ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ గతేడాది రూ.24.75 కోట్లు పలికారు.
Similar News
News November 24, 2024
అఫ్గాన్ స్పిన్నర్‌కు రూ.10 కోట్లు
IPL మెగా వేలంలో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ అదరగొట్టారు. అతడిని రూ.10 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. శ్రీలంక ఆల్‌రౌండర్ వహిండు హసరంగాను రూ.5.25 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇప్పటికే చెన్నైలో అశ్విన్, జడేజా లాంటి స్పిన్నర్లు ఉన్నారు.
News November 24, 2024
గుండెపోట్లు చలికాలంలోనే ఎక్కువ ఎందుకు?
చలి వల్ల కండరాలు బిగుసుకుపోయి గుండెకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా శరీరానికి తగినంత బ్లడ్ సరఫరా చేసేందుకు హార్ట్ పని పెరుగుతుంది. ఇది బ్లడ్ ప్రెజర్ పెరగడానికి దారి తీస్తుంది. బ్లడ్ ప్రెజర్ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురై గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. చలికాలం శరీరాన్ని వెచ్చగా ఉండేలా చూసుకొని, వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
News November 24, 2024
IPL మెగా వేలం అప్‌డేట్స్
*స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసిన SRH
*ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపాను రూ.2.4 కోట్లకు దక్కించుకున్న SRH
*రూ.4.80 కోట్లకు ఖలీల్ అహ్మద్‌ను కొన్న CSK
*రూ.6.50 కోట్లకు నోర్ట్జేను సొంతం చేసుకున్న KKR
*అఫ్గాన్ ఓపెనర్ గుర్బాజ్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన KKR
*మహీశ్ తీక్షణను రూ.4.4 కోట్లకు దక్కించుకున్న రాజస్థాన్