News November 24, 2024
గవర్నర్‌ను కలిసిన హేమంత్.. 28న ప్రమాణస్వీకారం
నవంబర్ 28న ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొద్దిసేపటి క్రితం గవర్నర్ సంతోష్ గంగ్వార్‌ను కలిసిన హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఝార్ఖండ్‌లో జేఎంఎం ఆధ్వర్యంలోని ఇండియా కూటమి 56 స్థానాల్లో విజయం సాధించడం తెలిసిందే. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, CPI(ML)L 2, ఎన్డీయే 24 స్థానాల్లో గెలుపొందాయి.
Similar News
News November 25, 2024
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే..
రాత్రి పడుకునే ముందు పాదాలకు నువ్వుల/కొబ్బరి/ఆవ/బాదం నూనెతో మసాజ్ చేస్తే ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోకి శక్తి ప్రవహించి వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యం అవుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. నాడులు ఉత్తేజితమై మరుసటి రోజు ఉత్సాహంగా పని చేస్తారు. బాడీ రిలాక్స్ అయి వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. అలాగే పాదాలకు ఇన్ఫెక్షన్లు రావు. మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
News November 25, 2024
Great.. 5 ప్రభుత్వ ఉద్యోగాలు
కరీంనగర్‌లోని మంకమ్మతోటకు చెందిన రాజశేఖర్ ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. TGT, PGT, జూనియర్ లెక్చరర్, గ్రూప్-4, టీజీపీఎస్సీ ఫలితాల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుకు ఎంపికై ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం గంగాధర వెల్ఫేర్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్‌గా పని చేస్తున్న ఇతను ప్రతి పరీక్షను సవాలుగా తీసుకొని చదవడంతోనే ఇది సాధ్యమైందని అంటున్నారు. సబ్జెక్టుపై పట్టు సాధిస్తే ఉద్యోగ సాధన సులభమని చెబుతున్నారు.
News November 25, 2024
అంత డబ్బుకు నేను అర్హుడినే: చాహల్
ఐపీఎల్ వేలంలో స్పిన్నర్ చాహల్‌ను రూ.18 కోట్లకు పంజాబ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దానిపై చాహల్ హర్షం వ్యక్తం చేశారు. ‘ముందు టెన్షన్‌గా అనిపించింది. గడచిన మూడేళ్లలో వచ్చిన డబ్బు ఒకే ఏడాదిలో వస్తుంది. పంజాబ్ నాకోసం చూస్తోందని కొంతమంది స్నేహితులు ముందే అన్నారు. కానీ ఈ రేంజ్‌లో ఊహించలేదు. బహుశా రూ.12 కోట్లు వస్తాయేమో అనుకున్నా అంతే. కానీ ఈ డబ్బుకు నేను పూర్తిగా అర్హుడినే’ అని తెలిపారు.