News November 24, 2024

పంజాబ్‌ కింగ్స్‌పై క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

image

PBKS ఫ్రాంచైజీపై క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ సంచలన ఆరోపణలు చేశారు. IPLలో ఆ జట్టులో మళ్లీ ఆడటం తన వల్ల కాదని తేల్చిచెప్పారు. గౌతమ్ 2020లో పంజాబ్ తరఫున ఆడారు. ‘నేను ఏ జట్టుకు ఆడినా నా 100 శాతం ప్రదర్శన ఇస్తాను. కానీ పంజాబ్‌కు అలా ఆడలేను. క్రికెట్‌పరంగానే కాక ఇతర వ్యవహారాల్లోనూ ఆ జట్టుతో నాకు మంచి అనుభవం లేదు. క్రికెటర్‌గా నన్ను ఎలా ట్రీట్ చేయాలనుకుంటానో అలా వారు వ్యవహరించలేదు’ అని స్పష్టం చేశారు.

Similar News

News November 25, 2024

TODAY HEADLINES

image

☛ IPL చరిత్రలో రికార్డ్ ధర రూ.27 కోట్లు పలికిన పంత్
☛ మా ఇల్లు బఫర్ జోన్‌లో లేదు: HYDRA కమిషనర్
☛ BGTలో జైస్వాల్, కోహ్లీ సెంచరీలు.. AUS టార్గెట్ 534
☛ కోస్తాంధ్రలో 27 నుంచి భారీ వర్షాలు
☛ 28న ఝార్ఖండ్ సీఎంగా సోరెన్ ప్రమాణం
☛ రేవంత్.. ఎవర్ని పిచ్చోళ్లను చేస్తున్నావ్: KTR
☛ రేపటి నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్
☛ నేనూ NCC క్యాడెట్‌నే: ప్రధాని మోదీ
☛ విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటం: జగన్

News November 25, 2024

చైతూ, శోభిత పెళ్లి అక్కడే ఎందుకంటే?

image

నాగ చైతన్య, శోభిత పెళ్లి డిసెంబర్ 4న జరగనుంది. ఎలాంటి ఆడంబరం లేకుండా వేడుక జరగనుండగా, వారిద్దరే దగ్గరుండి పనులు చూసుకుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి నిర్వహించాలని ఫ్యామిలీ నిర్ణయించినట్లు చైతూ తెలిపారు. అక్కడున్న ANR విగ్రహం ముందు పెళ్లి జరిగితే ఆయన ఆశీర్వాదాలు ఉంటాయని సెంటిమెంట్‌గా భావిస్తున్నట్లు చెప్పారు. శోభితతో కొత్త జీవితం ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నట్లు చైతన్య వివరించారు.

News November 25, 2024

తొలి రోజు ముగిసిన ఐపీఎల్ వేలం

image

ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు ముగిసింది. రేపు కూడా ఆక్షన్ కొనసాగనుంది. ఐపీఎల్ చరిత్రలోనే వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా రిషభ్ పంత్(రూ.27 కోట్లు-LSG) నిలిచారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(రూ.26.75కోట్లు-PBKS) నిలిచారు. మొత్తం 72 మంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. ఇంకా డుప్లెసిస్, విలియమ్సన్, సామ్ కరన్, భువనేశ్వర్, సుందర్, డేవిడ్ వంటి ప్లేయర్ల భవితవ్యం రేపు తేలనుంది.