News November 24, 2024

అమ్ముడుపోని పడిక్కల్

image

టీమ్ ఇండియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అన్‌సోల్డ్‌గా నిలిచారు. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఇతడిని తీసుకోవడానికి ఏ జట్టూ ఆసక్తి చూపకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలారు. గత సీజన్లలో బెంగళూరు, రాజస్థాన్, తదితర జట్లకు ఆడారు. 64 మ్యాచుల్లో 1559 రన్స్ చేశారు.

Similar News

News November 25, 2024

తొలి రోజు ముగిసిన ఐపీఎల్ వేలం

image

ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు ముగిసింది. రేపు కూడా ఆక్షన్ కొనసాగనుంది. ఐపీఎల్ చరిత్రలోనే వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా రిషభ్ పంత్(రూ.27 కోట్లు-LSG) నిలిచారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(రూ.26.75కోట్లు-PBKS) నిలిచారు. మొత్తం 72 మంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. ఇంకా డుప్లెసిస్, విలియమ్సన్, సామ్ కరన్, భువనేశ్వర్, సుందర్, డేవిడ్ వంటి ప్లేయర్ల భవితవ్యం రేపు తేలనుంది.

News November 25, 2024

IPL మెగా వేలం UPDATES

image

→ రసిఖ్‌ధర్‌ను రూ.6కోట్లకు కొన్న RCB
→ అబ్దుల్ సమద్‌ను రూ.4.20కోట్లకు దక్కించుకున్న LSG
→ అశుతోశ్ శర్మకు రూ.3.80కోట్లు ఖర్చు చేసిన DC
→ మోహిత్ శర్మను రూ.2.20కోట్లకు సొంతం చేసుకున్న DC
→ మహిపాల్ లామ్రోర్‌ను రూ.1.70కోట్లకు కొన్న GT
→ హర్‌ప్రీత్ బ్రార్‌ను రూ.1.50కోట్లకు కొన్న PBKS
→ విజయ్ శంకర్‌ను రూ.1.20కోట్లకు సొంతం చేసుకున్న CSK
→ ఆకాశ్ మద్వల్‌ను రూ.1.20 కోట్లకు కొన్న RR

News November 25, 2024

రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే..

image

రాత్రి పడుకునే ముందు పాదాలకు నువ్వుల/కొబ్బరి/ఆవ/బాదం నూనెతో మసాజ్ చేస్తే ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోకి శక్తి ప్రవహించి వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యం అవుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. నాడులు ఉత్తేజితమై మరుసటి రోజు ఉత్సాహంగా పని చేస్తారు. బాడీ రిలాక్స్ అయి వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. అలాగే పాదాలకు ఇన్ఫెక్షన్లు రావు. మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.