News November 24, 2024

SRHకు ఇషాన్ కిషన్‌.. రూ.11.25 కోట్లు

image

వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను రూ.11.25 కోట్లకు SRH దక్కించుకుంది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో కిషన్ వేలంలోకి రాగా ఢిల్లీ, పంజాబ్, కేకేఆర్, హైదరాబాద్ పోటీపడ్డాయి. ఇతను ఐపీఎల్ కెరీర్‌లో 105 మ్యాచులు ఆడి 2644 రన్స్ చేశారు. స్ట్రైక్ రేట్ 135.87గా ఉంది. ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడటం ఇ’షాన్’ స్పెషాలిటీ.

Similar News

News February 16, 2026

లాకర్లలోని 2.7 KGల బంగారాన్ని కొట్టేసిన అసిస్టెంట్ మేనేజర్.. ఎందుకంటే?

image

బెంగళూరులో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు అలవాటు పడ్డ ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కస్టమర్లకు చెందిన 2.7 KGల బంగారాన్ని (దాదాపు రూ.4 కోట్లు) కొట్టేశాడు. ఇండియన్ బ్యాంకుకు చెందిన కిరణ్ మేనేజర్ లేని సమయంలో తన లాకర్ యాక్సెస్‌తో కస్టమర్ల గోల్డ్ కొట్టేశాడు. దాన్ని తాకట్టు పెట్టి ఎంజాయ్ చేసేవాడు. ఓ మహిళ తన బంగారం కోసం రావడంతో గుట్టురట్టయింది. పోలీసులు కిరణ్‌ను అరెస్టు చేసి 700 గ్రా. బంగారం రికవరీ చేశారు.

News February 16, 2026

సీనియర్ హీరోయిన్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!

image

బాలీవుడ్ గ్లామరస్, సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ SMలో బ్యూటీ, ఫిట్‌నెస్ సీక్రెట్లు పంచుకుంటూ ఉంటారు. ఉదయం ఖాళీ కడుపుతో బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ తాగడం తనకు అలవాటని ఆమె చెప్పారు. దీనివల్ల ఎనర్జీ, పేగు ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, మెంటల్ హెల్త్ మెరుగవ్వడం, బరువు తగ్గడం వంటి ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. బ్లాక్ కాఫీలో స్వచ్ఛమైన దేశీ నెయ్యి కలిపి తీసుకునేదే ఈ బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ.

News February 16, 2026

11 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ల ఎన్నిక వాయిదా

image

TG: మున్సిపాలిటీల్లో నేడు నిర్వహించిన మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల ముగియగా 11 ప్రాంతాల్లో వాయిదా పడింది. కోరం లేమి సహా ఇతర అంశాలనేకం దీనికి కారణం. తొర్రూరు, ఇల్లందు, జహీరాబాద్, జనగామ, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, ఇంద్రేశం, డోర్నకల్‌లో ఎన్నిక జరగలేదు. కొన్నింటి ఎన్నికను రేపటికి వాయిదా వేయగా మరికొన్నిటికి తేదీని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.