News November 24, 2024

నట్టూకు రూ.10.75 కోట్లు

image

IPL మెగా వేలంలో పేసర్ నటరాజన్ మంచి ధర పలికారు. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ ఉన్న అతడిని రూ.10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇతడు IPLలో 61 మ్యాచులు ఆడి 67 వికెట్లు తీశారు. యార్కర్లు, స్లో బాల్స్‌తో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో నట్టూ స్పెషలిస్ట్.

Similar News

News November 10, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* ఏలూరు(D) జంగారెడ్డిగూడెంలో దివంగత సింగర్ ఎస్పీ బాలు విగ్రహాన్ని ఆయన కుమారుడు చరణ్ ఆవిష్కరించారు.
* PPP విధానంలో ప్రజలపై భారం పడకుండా పలు కీలక రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి రూ.2,800 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
* పట్టణాల్లోని వ్యాపార భవనాల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ECBC) అమలులో దేశంలోనే AP అగ్రస్థానంలో నిలిచింది.

News November 10, 2025

నేటి నుంచి ‘స్వామిత్వ’ గ్రామసభలు

image

APలో <<18165882>>స్వామిత్వ<<>>(SVAMITVA) కార్యక్రమం ఊపందుకుంది. 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డుల జారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ కంఠాల్లో ఇళ్లు, స్థలాలకు అర్హులైన యజమానులకు ప్రాపర్టీ కార్డుల జారీకి ముందు అభ్యంతరాలకు స్వీకరణ చేయనుంది. ఇందుకోసం నేటి నుంచి ఈ నెల 22 వరకు గ్రామ సభలు నిర్వహించనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, సర్వే శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి.

News November 10, 2025

మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచిన ప్రభుత్వం

image

AP: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో పీజీ, యూజీ కోర్సుల ఫీజులను ప్రభుత్వం పెంచింది. 2020-23 బ్లాక్ పీరియడ్‌లో ఉన్న ఫీజుపై యూజీ కోర్సులకు 10%, సూపర్ స్పెషాలిటీ, పీజీ కోర్సులకు 15% పెంపునకు ఆమోదం తెలిపింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తుదితీర్పులకు లోబడి ఇది ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు రూ.17.25 లక్షలుగా ఫీజును నిర్ధారించింది.