News November 24, 2024

మా ఇల్లు బఫర్ జోన్‌లో లేదు: హైడ్రా కమిషనర్

image

HYD మధురానగర్‌లోని తన ఇల్లు బఫర్ జోన్‌లో లేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. 44ఏళ్ల కిందట తన తండ్రి నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నామన్నారు. ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చారని చెప్పారు. ఆ పార్క్‌‌కు తమ ఇంటికి మధ్య కి.మీ. దూరం ఉందని వివరించారు. చెరువు కట్ట దిగువన 10 మీటర్లు దాటితే బఫర్ జోన్ పరిధిలోకి రాదన్నారు.

Similar News

News November 25, 2024

శివసేన శాసనసభాపక్ష నేతగా షిండే

image

మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. శివసేన షిండే వర్గం ఏక్‌నాథ్ షిండేను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆయనను ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అంతకుముందు అజిత్ పవార్‌ను ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. రేపటితో ప్రభుత్వ పదవికాలం పూర్తి కానుండటంతో ఆ లోపే సీఎం అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

News November 25, 2024

తొలిరోజు వేలం తర్వాత LSG, RR, PBKS జట్లు

image

LSG: పంత్, పూరన్, మయాంక్ యాదవ్, బిష్ణోయ్, ఆవేశ్, మిల్లర్, సమద్, బదోనీ, మొహ్సీన్, మార్ష్, మార్క్‌రమ్, జుయల్
RR: జైస్వాల్, శాంసన్, జురెల్, పరాగ్, ఆర్చర్, హెట్మెయిర్, హసరంగ, తీక్షణ, సందీప్ శర్మ, మధ్వాల్, కుమార్ కార్తికేయ
PBKS: శ్రేయస్ అయ్యర్, అర్షదీప్, చాహల్, స్టొయినిస్, శశాంక్, వధేరా, మ్యాక్స్‌వెల్, ప్రభ్‌సిమ్రన్, వైశాఖ్, యశ్ థాకూర్, బ్రార్, విష్ణు వినోద్

News November 25, 2024

తొలిరోజు వేలం తర్వాత DC, GT, KKR జట్లు

image

DC: అక్షర్, KL రాహుల్, కుల్దీప్, స్టార్క్, నటరాజన్, స్టబ్స్, మెక్‌గుర్క్, బ్రూక్, పోరెల్, అశుతోశ్, మోహిత్, రిజ్వీ, కరుణ్
GT: రషీద్, గిల్, బట్లర్, సిరాజ్, రబాడా, ప్రసిద్ధ్, సుదర్శన్, షారుఖ్, తెవాటియా, లోమ్రోర్, కుషాగ్రా, నిషాంత్, మానవ్, అనూజ్
KKR: వెంకీ అయ్యర్, రింకూ, వరుణ్, రస్సెల్, నరైన్, నోకియా, హర్షిత్, రమణ్‌దీప్, డికాక్, రఘువంశీ, గుర్బాజ్, వైభవ్, మార్కండే