News November 25, 2024
అంత డబ్బుకు నేను అర్హుడినే: చాహల్

ఐపీఎల్ వేలంలో స్పిన్నర్ చాహల్‌ను రూ.18 కోట్లకు పంజాబ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దానిపై చాహల్ హర్షం వ్యక్తం చేశారు. ‘ముందు టెన్షన్‌గా అనిపించింది. గడచిన మూడేళ్లలో వచ్చిన డబ్బు ఒకే ఏడాదిలో వస్తుంది. పంజాబ్ నాకోసం చూస్తోందని కొంతమంది స్నేహితులు ముందే అన్నారు. కానీ ఈ రేంజ్లో ఊహించలేదు. బహుశా రూ.12 కోట్లు వస్తాయేమో అనుకున్నా అంతే. కానీ ఈ డబ్బుకు నేను పూర్తిగా అర్హుడినే’ అని తెలిపారు.
Similar News
News January 1, 2026
న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కలకలం!

TG: న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కలకలం రేపింది. హైదరాబాద్‌లోని ఇల్యూషన్ పబ్‌లో డీజే ఆర్టిస్ట్‌కు డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నార్సింగిలో రాజేంద్రనగర్ SOT పోలీసులు దాడులు చేశారు. ఐదు గ్రాముల కొకైన్ సీజ్ చేశారు. మరోవైపు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు.
News January 1, 2026
అసభ్యంగా తాకేందుకు ప్రయత్నిస్తే బూటుతో కొట్టా: బ్రిటన్ రాణి

టీనేజీలో తనకు ఎదురైన అనుభవాన్ని బ్రిటన్ రాణి కెమిల్లా తాజాగా పంచుకున్నారు. ‘16-17 ఏళ్ల వయసులో నేను లండన్‌లో రైలులో వెళ్తుండగా ఓ వ్యక్తి అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. అతడిని అడ్డుకోవడంతో నాపై దాడి చేశాడు. నేను బూటు తీసి కొట్టాను. మహిళలపై జరుగుతున్న హింస ఎంత పెద్ద సమస్యో తెలియజేసేందుకే ఇప్పుడు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా’ అని ఓ రేడియో ఇంటర్వ్యూలో కెమిల్లా తెలిపారు.
News January 1, 2026
సింగర్ మంగ్లీ ఈవెంట్లో విషాదం?

AP: సింగర్ మంగ్లీ ఈవెంట్లో విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురంలో శుభారంభ్ పేరుతో నిర్వహిస్తున్న న్యూఇయర్ వేడుకల్లో ఓ యువకుడు చనిపోయాడని సమాచారం. వేణుగోపాల్ నగర్‌కు చెందిన షౌకత్ కరెంట్ షాక్‌తో మృతి చెందాడని తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేడుకల సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.


