News November 25, 2024
IPL మెగా వేలం UPDATES
→ రసిఖ్‌ధర్‌ను రూ.6కోట్లకు కొన్న RCB
→ అబ్దుల్ సమద్‌ను రూ.4.20కోట్లకు దక్కించుకున్న LSG
→ అశుతోశ్ శర్మకు రూ.3.80కోట్లు ఖర్చు చేసిన DC
→ మోహిత్ శర్మను రూ.2.20కోట్లకు సొంతం చేసుకున్న DC
→ మహిపాల్ లామ్రోర్‌ను రూ.1.70కోట్లకు కొన్న GT
→ హర్‌ప్రీత్ బ్రార్‌ను రూ.1.50కోట్లకు కొన్న PBKS
→ విజయ్ శంకర్‌ను రూ.1.20కోట్లకు సొంతం చేసుకున్న CSK
→ ఆకాశ్ మద్వల్‌ను రూ.1.20 కోట్లకు కొన్న RR
Similar News
News November 25, 2024
జేఈఈ మెయిన్స్-1 దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్
జేఈఈ మెయిన్స్-1 దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియగా, తప్పుల సవరణకు ఎన్టీఏ అవకాశమిచ్చింది. రేపు, ఎల్లుండి వెబ్‌సైట్‌లో ఎడిట్ ఆప్షన్ ద్వారా తప్పులు సవరించుకోవచ్చని పేర్కొంది. అభ్యర్థి పేరు, DOB, తల్లిదండ్రుల పేర్లలో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. మొబైల్ నంబర్, ఈమెయిల్, ఫొటో, అడ్రస్ మార్చుకునేందుకు అవకాశం లేదు.
News November 25, 2024
తొలి రోజు అన్‌సోల్డ్ ప్లేయర్లు వీరే..
తొలి రోజు IPL మెగా వేలంలో దేవదత్ పడిక్కల్, డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, వాకర్ సలామ్ కీల్, పియూష్ చావ్లా, కార్తీక్ త్యాగి, యశ్ దుల్, అన్మోల్ ప్రీత్ సింగ్, ఉత్కర్ష్ సింగ్, లవ్నీత్ సిసోడియా, ఉపేంద్ర సింగ్ యాదవ్, శ్రేయస్ గోపాల్ అన్ సోల్డ్ ప్లేయర్లుగా మిగిలారు. అత్యధికంగా పంజాబ్(PBKS) 10 మంది ప్లేయర్లను వేలంలో దక్కించుకోగా అత్యల్పంగా ముంబై ఇండియన్స్ నలుగురిని కొనుగోలు చేసింది.
News November 25, 2024
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల ఏడుపు: మంత్రి శ్రీధర్ బాబు
TG: అధికారం పోయిందని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక అల్లాడిపోయారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. తమది చేతల ప్రభుత్వమని, ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తామని చెప్పారు.