News November 25, 2024

TODAY HEADLINES

image

☛ IPL చరిత్రలో రికార్డ్ ధర రూ.27 కోట్లు పలికిన పంత్
☛ మా ఇల్లు బఫర్ జోన్‌లో లేదు: HYDRA కమిషనర్
☛ BGTలో జైస్వాల్, కోహ్లీ సెంచరీలు.. AUS టార్గెట్ 534
☛ కోస్తాంధ్రలో 27 నుంచి భారీ వర్షాలు
☛ 28న ఝార్ఖండ్ సీఎంగా సోరెన్ ప్రమాణం
☛ రేవంత్.. ఎవర్ని పిచ్చోళ్లను చేస్తున్నావ్: KTR
☛ రేపటి నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్
☛ నేనూ NCC క్యాడెట్‌నే: ప్రధాని మోదీ
☛ విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటం: జగన్

Similar News

News November 25, 2024

IPL: ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు(రూ.కోట్లలో) ఉందంటే?

image

* RCB-రూ.30.65 * ముంబై ఇండియన్స్- రూ.26.10
* PBKS -రూ.22.50 * గుజరాత్ టైటాన్స్-రూ.17.50
* రాజస్థాన్ రాయల్స్ – రూ.17.35
* CSK-రూ.15.60 * లక్నో సూపర్ జెయింట్స్-రూ.14.85
* ఢిల్లీ క్యాపిటల్స్-రూ.13.80 *KKR-రూ.10.05
* సన్ రైజర్స్ హైదరాబాద్-రూ.5.15

News November 25, 2024

మహారాష్ట్రలో ఎంవీఏ ఓటమిపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు

image

మహారాష్ట్రలో మహిళలను అగౌరవపరిచినందుకే మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ఓటమి పాలైందని ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రే దారుణమైన పరాజయాన్ని పొందుతారని తాను ముందే ఊహించినట్లు తెలిపారు. ముంబైలోని తన నివాసాన్ని కూల్చివేసి దూషించినట్లు పేర్కొన్నారు. దేశ విచ్ఛిన్నం గురించి మాట్లాడిన వారికి మహా ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని దుయ్యబట్టారు.

News November 25, 2024

సర్వే అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: మంత్రి పొన్నం

image

TG: బీసీలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కులగణన కార్యక్రమం చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉప్పల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వే అధికారులకు ప్రతి ఒక్కరూ పూర్తి వివరాలు తెలిపి వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డేటా సంక్షేమ పథకాల లబ్ధి, బీసీల అభివృద్ధికి చొరవ చూపిస్తుందన్నారు. ఒకవేళ ఎన్యుమరేటర్లు రాకపోతే పిలిపించుకొని సర్వే నిర్వహించుకోవాలని సూచించారు.