News November 25, 2024
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం పాల్వంచ పట్టణంలో పర్యటించారు. పట్టణంలోని ఎస్సి బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే పాఠశాల సిబ్బందికి తెలపాలని కలెక్టర్ విద్యార్థినులను సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 13, 2026
రైతులకు ఊరట.. జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు

ఖమ్మం జిల్లాలో సాగు సీజన్‌కు సంబంధించి ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9,844 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. పీఏసీఎస్‌లు, ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎరువుల దుకాణదారులు ఎంఆర్‌పీ ధరలకే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News January 13, 2026
నేడు ‘మంచుకొండ’ ఎత్తిపోతల పథకం ప్రారంభం

రఘునాథపాలెం మండల రైతుల దశాబ్దాల కల సాకారమవుతోంది. ప్రభుత్వం నిర్మించిన ‘మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని’ నేడు ప్రారంభించనున్నారు. రూ. 66.33 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 37 చెరువులను నింపుతూ సుమారు 3,500 ఎకరాలకు సాగర్ జలాలు అందనున్నాయి. 2025 జనవరిలో శంకుస్థాపన చేసిన ఈ పథకాన్ని, మంత్రి తుమ్మల చొరవతో ఏడాదిలోనే పూర్తి చేసి సంక్రాంతి కానుకగా రైతులకు అంకితం చేస్తున్నారు.
News January 12, 2026
ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు: DAO

ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 9,844 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఎటువంటి కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేసేందుకు అన్ని మండలాల్లో చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్యాక్స్, ప్రైవేట్ డీలర్లకు యూరియా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 32,793 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.


