News November 25, 2024
తొలిరోజు వేలం తర్వాత SRH, CSK, RCB, MI జట్లు
SRH: అభిషేక్, హెడ్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అభినవ్, హర్షల్, కమిన్స్, షమీ, రాహుల్ చాహర్, జాంపా, సిమర్‌జీత్, అథర్వ
CSK: రుతురాజ్, జడేజా, పతిరణ, దూబే, నూర్, అశ్విన్, కాన్వే, ఖలీల్, రచిన్, ధోనీ, త్రిపాఠీ, విజయ్ శంకర్
MI: బుమ్రా, హార్దిక్, సూర్య, రోహిత్, బౌల్ట్, తిలక్, నమన్, రాబిన్ మింజ్, కరణ్ శర్మ
RCB: విరాట్, హేజిల్‌వుడ్, సాల్ట్, పటీదార్, జితేశ్, లివింగ్‌స్టోన్, రసిఖ్, యశ్ దయాళ్, సుయాశ్
Similar News
News November 25, 2024
వచ్చే నెలలో రెండు ఇస్రో ప్రయోగాలు
డిసెంబర్ నెలలో షార్ నుంచి ఇస్రో రెండు ప్రయోగాలను చేపట్టనుంది. 4వ తేదీన PSLV C59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా-3 అనే శాటిలైట్‌తో పాటు మరో 4 చిన్నతరహా ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించనుంది. 24వ తేదీన PSLV C60 ద్వారా రిశాట్-1B సహా నాలుగు వాణిజ్యపరమైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు సైంటిస్టులు సన్నాహాలు చేస్తున్నారు.
News November 25, 2024
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై ఆయన అధిష్ఠానంతో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పార్టీ పెద్దలను ఆహ్వానిస్తారని సమాచారం. దీంతోపాటు మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
News November 25, 2024
విజయానికి 7 వికెట్లే..
BGTలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్సులో జైస్వాల్, కోహ్లీ సెంచరీలు చేయడంతో అతిథ్య జట్టు ముందు 534 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో AUS 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కొండంత టార్గెట్‌ను ఛేదించడం ఆస్ట్రేలియాకు సవాల్‌గా మారింది. మరోవైపు మిగతా 7 వికెట్లు కూల్చి భారత్‌కు తొలి విజయాన్ని అందించాలని బుమ్రా సేన ఉవ్విళ్లూరుతోంది.