News November 25, 2024
ప్రపంచంలో భూమికి అత్యంత దూరమైన ప్రదేశం ఇదే
న్యూజిలాండ్‌కి, చిలీకి మధ్య ఉన్న దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న పాయింట్ నీమో అనే ప్రాంతాన్ని ప్రపంచంలో అత్యంత ఒంటరితనంగా ఉండే ప్రాంతంగా పరిశోధకులు చెబుతుంటారు. 1992లో దీన్ని గుర్తించారు. ఇక్కడి నుంచి కనుచూపు మేరలో భూమి కనిపించదు. దగ్గర్లోని భూమి 2688 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరెక్ట్‌గా చెప్పాలంటే భూమి కంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమే నీమో పాయింట్‌కు దగ్గరగా(400 కి.మీ) ఉంటుంది.
Similar News
News November 25, 2024
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు: 29 మంది మృతి
లెబనాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ విరుచుకుపడింది. బీరూట్‌లోని ఓ బిల్డింగుపై వరుసగా ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టింది. భీకరమైన ఈ దాడుల్లో 29 మంది మరణించారు. హెజ్బొల్లాకు చెందిన ఇంటెలిజెన్స్ యూనిట్, మిసైల్ యూనిట్, ఆయుధాలను స్మగ్లింగ్ చేసే 4400 యూనిట్ సహా 12 కమాండ్ సెంటర్లను నాశనం చేశామని IDF ప్రకటించింది. తమ దేశంపై టెర్రరిస్టు దాడుల ప్లానింగ్, కమాండ్, అమలుకు వీటిని వాడేవాళ్లని తెలిపింది.
News November 25, 2024
ఈరోజు ఉ.10 గంటలకు..
AP: తిరుమల శ్రీవారి దర్శన, గదుల టికెట్లను నేడు విడుదల కానున్నాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను ఉ.10 గంటలకు ఆన్లైన్లో ఉంచుతారు. అలాగే ఫిబ్రవరి కోటా గదుల టికెట్లను ఈరోజు మ.3 గంటలకు విడుదల చేయనున్నారు. ఆర్జిత సేవలు, దర్శనం, వసతి కోటా టికెట్లను https://ttdevasthanams.ap.gov.in సైట్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.
News November 25, 2024
మాజీ MLA రామచంద్రారెడ్డి కన్నుమూత
TG: సిద్దిపేట జిల్లాకు చెందిన మాజీ MLA డి. రామచంద్రారెడ్డి(85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయారు. మాజీ సీఎం కేసీఆర్ సమకాలికులైన ఈయన 1985లో దొమ్మాట నియోజకవర్గం(ప్రస్తుతం దుబ్బాక) నుంచి TDP ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామచంద్రారెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారి వద్దే ఉంటున్నారు. స్వస్థలం సిద్దిపేట జిల్లా కొండపాక.