News November 25, 2024
సర్వే అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: మంత్రి పొన్నం
TG: బీసీలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కులగణన కార్యక్రమం చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉప్పల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వే అధికారులకు ప్రతి ఒక్కరూ పూర్తి వివరాలు తెలిపి వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డేటా సంక్షేమ పథకాల లబ్ధి, బీసీల అభివృద్ధికి చొరవ చూపిస్తుందన్నారు. ఒకవేళ ఎన్యుమరేటర్లు రాకపోతే పిలిపించుకొని సర్వే నిర్వహించుకోవాలని సూచించారు.
Similar News
News November 25, 2024
‘కన్నప్ప’ రిలీజ్ డేట్ ఫిక్స్
మంచు విష్ణు ప్రధానపాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు విష్ణు ‘X’లో వెల్లడించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితర అగ్రనటులు నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
News November 25, 2024
గాలి నాణ్యతను బట్టి భూమి ధరను నిర్ధారించాలి: జెరోధా సీఈవో
కాలుష్యాన్ని తగ్గించాలంటే గాలి&నీటి నాణ్యతను బట్టి ఆ ప్రాంత భూమి ధరను నిర్ణయించేలా రూల్ తేవాలని జెరోధా CEO నితిన్ అభిప్రాయపడ్డారు. ‘ఇలా చేస్తే అక్కడున్న యజమానులంతా గ్రూప్‌గా మారి పర్యావరణంపై దృష్టి పెడతారు. నా అనే ఇల్లు గురించి ఆలోచిస్తేనే మన లేఅవుట్ పరిస్థితులు మారతాయి. AQIలో ఢిల్లీపైనే అందరూ దృష్టిసారించినా ముంబై, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత పడిపోయింది’ అని ట్వీట్ చేశారు.
News November 25, 2024
నేటి నుంచి లోక్‌సభలో ఓ కొత్త సంప్రదాయం
లోక్‌సభలో ఓ కొత్త సంప్రదాయం మొదలవ్వనుంది. ఇక నుంచి సభకు హాజరయ్యే ఎంపీలు ఎలక్ట్రానిక్ ట్యాబ్‌లో డిజిటల్ పెన్‌తో అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. పార్లమెంటులో పేపర్ వాడకూడదన్న స్పీకర్ ఓం బిర్లా ఆకాంక్ష మేరకు లాబీలో 4 కౌంటర్ల వద్ద ట్యాబుల్ని ఉంచుతున్నామని LS సెక్రటేరియట్ తెలిపింది. ఫిజికల్ అటెండెన్స్ రిజిస్టర్లూ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. గతంలో సభ్యులు మొబైల్ యాప్ ద్వారా అటెండెన్స్ వేసేవాళ్లు.