News November 25, 2024
మహారాష్ట్రలో ఎంవీఏ ఓటమిపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు
మహారాష్ట్రలో మహిళలను అగౌరవపరిచినందుకే మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ఓటమి పాలైందని ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రే దారుణమైన పరాజయాన్ని పొందుతారని తాను ముందే ఊహించినట్లు తెలిపారు. ముంబైలోని తన నివాసాన్ని కూల్చివేసి దూషించినట్లు పేర్కొన్నారు. దేశ విచ్ఛిన్నం గురించి మాట్లాడిన వారికి మహా ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని దుయ్యబట్టారు.
Similar News
News November 25, 2024
STOCK MARKETS: 400 పాయింట్ల లాభంతో నిఫ్టీ ఆరంభం
అనుకున్నదే జరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 24,300 (+400), సెన్సెక్స్ 80,286 (+1175) వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, రియాల్టి, O&G రంగాల షేర్లకు డిమాండ్ నెలకొంది. నిఫ్టీలో JSW స్టీల్, ఇన్ఫీ మినహా 48 కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి. శ్రీరామ్ ఫిన్, M&M, LT, BEL, BPCL టాప్ గెయినర్స్. నిఫ్టీ చివరి 2 సెషన్లలోనే 800 పాయింట్ల మేర పెరగడం విశేషం.
News November 25, 2024
FLASH: భారీ విజయం దిశగా భారత్
పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ భారీ ఓటమి దిశగా సాగుతోంది. 79 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఇక భారత్ గెలుపు లాంఛనమే. నాథన్ 0, ఖవాజా 4, కమిన్స్ 2, లబుషేన్ 3, స్టీవెన్ స్మిత్ 17 పరుగులకు ఔటయ్యారు. ట్రావిస్ హెడ్(45) క్రీజులో ఉన్నారు. బుమ్రా 2, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. కాగా ఆసీస్ ఇంకా 455 పరుగులు చేయాల్సి ఉంది.
News November 25, 2024
భారత డ్రెస్సింగ్ రూంలో హిట్‌మ్యాన్
కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ ఇండియా డ్రెసింగ్ రూంలో కనిపించారు. కోచ్ గంభీర్‌తో కలిసి మ్యాచ్ వీక్షిస్తున్నారు. నిన్న పెర్త్ స్టేడియానికి చేరుకున్న రోహిత్.. ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నారు. రెండో టెస్టుకు అందుబాటులో ఉంటారు. బిడ్డ జన్మించడంతో రోహిత్ తొలి టెస్టుకు దూరమయ్యారు.