News November 25, 2024
పోలవరంలో కనువిందు చేస్తున్న ‘అడవి నాభి పుష్పాలు’

ప్రకృతిలో అందంగా పూసే అడవి నాభి పుష్పాలు పోలవరం నిర్మాణ ప్రాంతమైన ట్విల్ టన్నెల్‌కు వెళ్లే దారిలో చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఈ మొక్క వేరు దీర్ఘకాలిక వ్రణాలు, శరీరపు కుష్టు మంటలు వంటి మొదలగు వ్యాధులకు చికిత్సలో ఔషధంగా పనిచేస్తుందని, కానీ విష ప్రభావం ఉండటం వల్ల వైద్యుల సలహామేరకు తగిన మోతాదులో మాత్రమే వాడాలని నిపుణులు చెబుతున్నారు. అలంకరణకు కూడా ఉపయోగపడే ఈ మొక్క ప్రకృతికి అందాన్ని చేకూరుస్తుంది.
Similar News
News November 18, 2025
తణుకు: ‘తల్లిదండ్రులను చూడని పిల్లలు శిక్షార్హులు’

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వారి పోషణ పట్టించుకోలేని పిల్లలు శిక్షార్హులు అవుతారని తణుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోతర్లంక సాయిరాం అన్నారు. సోమవారం తణుకు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు ఆర్డీవో అధికారుల ద్వారా న్యాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

ఆకివీడు: ఆన్‌లైన్ మోసం.. 39వేలు పోగొట్టుకున్న మహిళ

ఆకివీడులో ఆన్‌లైన్ మోసం వెలుగు చూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో “రూ. 999కే మూడు డ్రెస్సులు” అనే ఆఫర్ నమ్మిన ఓ గృహిణి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దఫదఫాలుగా రూ.39 వేలు పోగొట్టుకున్నారు. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆకివీడు ఎస్ఐ హనుమంత నాగరాజుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు ధర్యాప్తు చేస్తున్నారు.