News November 25, 2024

కడప: ఒక్కడే మిగిలాడు.. అనాథయ్యాడు

image

మైదుకూరు ఘాట్‌లో నిన్న రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాశినాయన(M) చిన్నాయపల్లెకు చెందిన శ్రీనివాసులరెడ్డి(45), అరుణ(37) కుమారుడు జగదీశ్వర్ రెడ్డి ఖాజీపేటలో 8వ తరగతి చదువుతూ తిప్పాయపల్లెలోని అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. అతడిని చూసేందుకు కుమార్తె పవిత్ర(12)తో కలిసి దంపతులు బైకుపై బయల్దేరారు. ఘాట్ రోడ్డులో లారీని ఓవర్ టేక్ చేస్తూ కిందపడిపోయారు. వీరిపై నుంచి మరో లారీ వెళ్లడంతో ముగ్గరూ చనిపోయారు.

Similar News

News January 13, 2026

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

image

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రజలు, పోలీస్ సిబ్బందికి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటిల్లిపాది సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికెళ్లకుండా భోగి, మకర సంక్రాంతి, కనుమను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

News January 13, 2026

కడప జిల్లాలో 99,508 హెక్టార్లలో రబీ పంటల సాగు

image

జిల్లాలో రబీ పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1,39,796 హెక్టార్లు కాగా, ఈ ఏడాది
99,508 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పప్పు సెనగ 68,207, మినుము 12,421, మొక్కజొన్న 5,390, వరి 4,223, జొన్న 2,110, కుసుమ 1.970, వేరుశనగ 1,259, గోధుమ 28, సజ్జ 783, రాగి 115, కొర్ర 81, కంది 143, పెసర 949, ప్రొద్దుతిరుగుడు 422, పత్తి 248 హెక్టార్లలో సాగయ్యింది. గత ఏడాది 1,10,776 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు తెలిపారు.

News January 13, 2026

కడప జిల్లాలో డ్రైనేజీల అభివృద్ధికి నిధులు మంజూరు

image

కడప జిల్లాలోని మున్సిపాలిటీల్లో డ్రైనేజీల ఆధునీకరణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రొద్దుటూరు మునిసిపాలిటీకి రూ.65.09 కోట్లు నిధులు మంజూరయ్యాయని స్థానిక మునిసిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి తెలిపారు. కడపకు రూ.100 కోట్లు, బద్వేల్ రూ.31.97 కోట్లు, రాజంపేట రూ.21.62 కోట్లు, జమ్మలమడుగు రూ.21.16 కోట్లు, పులివెందుల రూ.28.91 కోట్లు, ఎర్రగుంట్ల రూ.38.06 కోట్లు మంజూరయ్యాయన్నారు.