News November 25, 2024
మాజీ MLA రామచంద్రారెడ్డి కన్నుమూత
TG: సిద్దిపేట జిల్లాకు చెందిన మాజీ MLA డి. రామచంద్రారెడ్డి(85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయారు. మాజీ సీఎం కేసీఆర్ సమకాలికులైన ఈయన 1985లో దొమ్మాట నియోజకవర్గం(ప్రస్తుతం దుబ్బాక) నుంచి TDP ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామచంద్రారెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారి వద్దే ఉంటున్నారు. స్వస్థలం సిద్దిపేట జిల్లా కొండపాక.
Similar News
News November 25, 2024
పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు గుడ్ న్యూస్
TG: పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడే అంశాలపై ‘జనరల్ స్టడీస్ ఫర్ ఆల్’ పేరుతో టీ-సాట్ ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల పాఠ్యాంశాలపై ఇవాళ్టి నుంచి 5 నెలల పాటు 600 ఎపిసోడ్‌లు ప్రసారం చేయనున్నట్లు టీ-సాట్ సీఈవో వేణుగోపాల్ తెలిపారు. టీ-సాట్ నిపుణ ఛానల్‌లో మ.12-1 గంటల వరకు, మ.3-4 గంటల వరకు, విద్య ఛానల్‌లో రా.8-10 గంటల వరకు టెలికాస్ట్ ఉంటుందని పేర్కొన్నారు.
News November 25, 2024
భూకేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం తీర్పు
TG: జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు కాగా, సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ప్రభుత్వానికి సొసైటీలు చెల్లించిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది.
News November 25, 2024
DCని కేఎల్, అక్షర్ లీడ్ చేస్తారు: పార్థ్ జిందాల్
వచ్చే IPL సీజన్‌లో DCని కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ లీడ్ చేస్తారని కోఓనర్ పార్థ్ జిందాల్ వెల్లడించారు. ‘మాకు యంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. టాప్ ఆర్డర్‌లో నిలకడ కోసం KLను తీసుకున్నాం. అతను ప్రతి సీజన్‌లో 400+ పరుగులు చేశారు. మా హోమ్ గ్రౌండ్(కోట్లా) అతనికి సరిగ్గా సరిపోతుంది. యంగ్ టీమ్‌ను KL, అక్షర్ గైడ్ చేస్తారు’ అని చెప్పారు. స్టార్క్, మెక్‌గుర్క్, బ్రూక్, అశుతోష్, రిజ్వీని వేలంలో DC దక్కించుకుంది.