News November 25, 2024

NLG: ముగింపు దశకు ధాన్యం సేకరణ

image

ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈఏడాది నల్గొండ జిల్లాలో 370, సూర్యాపేట జిల్లాలో 310, యాదాద్రి భువనగిరి జిల్లాలో 372 కేంద్రాలను ఏర్పాటు చేసి అధికారులు ధాన్యాన్ని సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో అక్టోబర్, నవంబర్ నెలల్లో అంచనాలకు మించి ధాన్యాన్ని రైతులు మార్కెట్లకు తీసుకువచ్చారు. గత ఏడాది ఉమ్మడి జిల్లాలో 4,24,135 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

Similar News

News September 15, 2025

NLG: సిరులు కురిపించనున్న తెల్ల బంగారం..!

image

పత్తి సాగు నల్గొండ జిల్లా రైతులకు సిరులు కురిపించనుంది. జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయ శాఖ అంచనాలకు మించి రైతులు పత్తి పెద్ద ఎత్తున సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5,47,735 ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేయగా అంచనాకు మించి 5,64,585 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. జిల్లాలో మొదటి దశ పత్తితీత పనులను ఇటీవల రైతులు ప్రారంభించారు. 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా.

News September 15, 2025

మూసీకి తగ్గిన వరద

image

మూసీ నదికి వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం 4,385.47 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను 4.12 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అధికారులు 3 క్రస్ట్ గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు.

News September 15, 2025

NLG: పాస్ ఉంటేనే అనుమతి

image

ఇవాళ నిర్వహించే MGU స్నాతకోత్సవానికి యూనివర్శిటీలోకి విద్యార్థితో పాటు వారి వెంట కుటుంబ సభ్యుల్లో ఒకరిని లోపలికి అనుమతించనున్నారు. వేదికపై వారికి కేటాయించిన సీట్లలో మాత్రమే అతిథులు ఆసీనులు కావాల్సి ఉంటుంది. యూనివర్శిటీలోకి వెళ్లాలంటే వారికి ఇచ్చిన అనుమతి పత్రం (పాస్) తప్పనిసరిగా ఉండాలి. పాస్ లేకుంటే యూనివర్సిటీ లోపలికి భద్రతా సిబ్బంది అనుమతించరు.