News November 25, 2024
పోటీపడి జలవిద్యుదుత్పత్తి.. అడుగంటుతున్న శ్రీశైలం జలాలు
శ్రీశైలం జలాశయం నుంచి AP, TG పోటీ పడి జలవిద్యుదుత్పత్తి చేస్తున్నాయి. రోజూ 40వేల క్యూసెక్కులు వాడుకుంటుండటంతో నీటినిల్వలు వేగంగా పడిపోతున్నాయి. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215TMCలు కాగా ప్రస్తుతం 149TMCలే మిగిలిఉన్నాయి. వచ్చే వర్షాకాలం వరకు సాగు, తాగు అవసరాల కోసం నీటిని సంరక్షించాలని కృష్ణా బోర్డు లేఖ రాసినా AP, TG పట్టించుకోవట్లేదు. ఇలాగే కొనసాగితే నీటి కటకట తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News November 25, 2024
ఈ హెడ్ ఎప్పుడూ మనకు ‘హెడే’కే..
భారత్‌తో ఆట అంటే చాలు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌కు పూనకం వస్తుంది. కీలక మ్యాచుల్లో రాణించి మనకు ట్రోఫీలను అందకుండా చేశారు. తాజాగా BGT తొలి టెస్టులోనూ హాఫ్ సెంచరీ చేశారు. INDపై WTC ఫైనల్లో, వన్డే WC ఫైనల్లో సెంచరీలు చేసి మనకు కప్పులు దూరం చేశారు. ఈ ఏడాది జరిగిన T20 WCలో ఫిఫ్టీ చేశారు.
News November 25, 2024
మహారాష్ట్ర CM: రీసెంట్ ట్రెండ్ ఏం చెబుతోందంటే..
మీడియాకు అందని విధంగా CMలను ఎంపిక చేయడం BJP స్పెషాలిటీ. రీసెంటు ట్రెండ్ ఇదే చెప్తోంది. ఉత్తరాఖండ్‌లో పుష్కర్ సింగ్ ధామి, రాజస్థాన్‌లో భజన్‌లాల్, ఒడిశాలో మోహన్ చరణ్, మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్, హరియాణాలో నాయబ్ సైనీని ఇలాగే ఎంపిక చేశారు. ఆయా రాష్ట్రాల్లో గెలిచినప్పుడు వసుంధర రాజె, మనోహర్‌లాల్, శివరాజ్ సింగ్ పేర్లపై మీడియాలో చర్చ జరగ్గా మంత్రులు, MLA పదవుల్లో లేనివారినీ ఎంపికచేసి BJP షాకిచ్చింది.
News November 25, 2024
ALERT.. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి నేడు వాయుగుండంగా మారనుంది. మరో 2 రోజుల్లో వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఎల్లుండి నుంచి కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రేపటి నుంచి సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.