News November 25, 2024
శ్రీవారి దర్శనానికి 10 గంటల టైమ్
AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండలవాడిని నిన్న 75,147 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,096 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు లభించింది.
Similar News
News November 25, 2024
కులగణన శాస్త్రీయంగా జరగాలి: MLC కవిత
TG: బీసీలకు న్యాయం జరగాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు MLC కవిత చెప్పారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ జాగృతి పోరాడుతోందని, BRS బీసీలకు న్యాయం చేసిందన్నారు. రాష్ట్రంలో కులగణన శాస్త్రీయంగా జరగాలని, కామారెడ్డి డిక్లరేషన్ యథాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని చెప్పారు.
News November 25, 2024
IPL జట్లకు కెప్టెన్లు వీరేనా?
వచ్చే ఐపీఎల్ సీజన్‌లో CSKకి రుతురాజ్ గైక్వాడ్, MIకి హార్దిక్ పాండ్య, SRHకు పాట్ కమిన్స్, RRకు సంజూ శాంసన్, GTకి శుభ్‌మన్ గిల్ కెప్టెన్లు కొనసాగడం ఖాయమైంది. ఢిల్లీకి కేఎల్ రాహుల్, LSGకి రిషభ్ పంత్, PBKSకు శ్రేయాస్ అయ్యర్ కొత్తగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. RCB(కోహ్లీ/డుప్లిసెస్), KKR(నరైన్/రసెల్) విషయంలో సందిగ్ధత ఏర్పడింది. ఇవాళ్టి వేలం తర్వాత ఓ స్పష్టత రానుంది.
News November 25, 2024
మహారాష్ట్ర CM: దేవేంద్ర ఫడణవీస్‌కు నో ఛాన్స్?
అంతా ఊహిస్తున్నట్టుగా దేవేంద్ర ఫడణవీస్‌కు CM పీఠం దక్కకపోవచ్చని తెలుస్తోంది. మహారాష్ట్రలో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే పార్టీలు మళ్లీ పుంజుకోకుండా వ్యూహాత్మక ఎంపిక ఉంటుందని సమాచారం. ఠాక్రే మరాఠీ, పవార్ మరాఠా అస్థిత్వం ఆధారంగా పార్టీలు నడుపుతున్నారు. ఈ రెండింటినీ న్యూట్రలైజ్ చేసేలా సీఎంను నియమిస్తారని విశ్లేషకుల అభిప్రాయం. మనోహర్, శివరాజ్‌లా కేంద్రంలోకి ఫడణవీస్‌ను తీసుకుంటారన్న వాదనా తెరపైకొచ్చింది.