News November 25, 2024
$99,800 వద్ద బిట్‌కాయిన్‌లో SHAKEOUT

క్రిప్టో కరెన్సీ కింగ్ బిట్‌కాయిన్ దూకుడు కొనసాగుతోంది. ప్రస్తుతం $98000 వద్ద కొనసాగుతోంది. అంటే భారత కరెన్సీలో రూ.82.60 లక్షలు అన్నమాట. మొన్న $99,800 వద్దకు చేరుకున్న BTC లక్ష డాలర్లను తాకడం లాంఛనమే అనుకున్నారు. రెసిస్టెన్సీ ఎదురవ్వడం, ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో $95,600కు దిగొచ్చింది. ఇన్వెస్టర్లు అక్యూములేట్ చేసుకోవడంతో మళ్లీ పుంజుకుంది. ఏదేమైనా లక్షల డాలర్లను తాకడం ఖాయమని నిపుణులు అంటున్నారు.
Similar News
News March 12, 2026
‘స్వర్ణ’ ఆఫీసుల్లో తరచూ తనిఖీలు

AP: స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డుల పనితీరు మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కలెక్టర్ నుంచి డిప్యూటీ కమిషనర్ల వరకు 8 కేటగిరీల అధికారులు నెలలో 3-12 సార్లు ఆ కార్యాలయాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. అందుతున్న సేవలు, పెన్షన్ల పంపిణీ, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను పరిశీలించాలని సూచించింది. సిబ్బంది పనితీరు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టిసారించాలంది.
News March 12, 2026
ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

TG: ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 10వ తేదీలోపే విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 4 లేదా 5వ తేదీన రిజల్ట్స్ ప్రకటించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వాల్యుయేషన్ ఆలస్యమైతే మరో 2-3 రోజులు పట్టే అవకాశమున్నట్లు సమాచారం. రాష్ట్రంలో FEB 25న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 18తో ముగియనున్నాయి. కాగా ఈనెల 4 నుంచే వాల్యుయేషన్ ప్రక్రియ మొదలైంది.
News March 12, 2026
ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులెలా: హైకోర్టు

AP: దేశాలు, రాష్ట్రాలతో పోటీ పడి పెట్టుబడులు రాబట్టాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. మార్కెట్ ధరకే భూములు ఇస్తామంటే కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎకరం రూ.99 పైసలకే ఇస్తున్నారంటూ YCP MP గురుమూర్తి వేసిన పిల్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి సమయం ఇస్తూ విచారణను వాయిదా వేసింది.


