News November 25, 2024

ఇవాళ విచారణకు హాజరు కాలేను: RGV

image

విచారణకు ఇవాళ హాజరు కాలేనని డైరెక్టర్ RGV తన అడ్వకేట్ శ్రీనివాసరావుకు సమాచారమిచ్చారు. కారణాలను ఒంగోలు పోలీసులకు చెబుతానన్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా చంద్రబాబు, పవన్‌లపై అనుచిత పోస్టులు పెట్టారని ప్రకాశం (M) మద్దిపాడులో RGVపై కేసు నమోదైంది. విచారణకు రావాలని పోలీసులు నోటీసులివ్వగా రాలేనని వారం కిందట చెప్పిన ఆయన ఇవాళ మరోసారి డుమ్మా కొట్టారు. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Similar News

News November 25, 2024

మీలా పైరవీలు చేయడానికి ఢిల్లీ వెళ్లడంలేదు: రేవంత్

image

TG: తాను తరచూ ఢిల్లీ వెళ్తానంటూ కేటీఆర్ చేస్తున్న విమర్శలకు CM రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘మీలా పైరవీలు చేయడానికి, బెయిల్ కోసం నేను వెళ్లడంలేదు. కేంద్రాన్ని కలిసి మనకు రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికే వెళ్లా. అవసరమైతే ఎన్నిసార్లైనా వెళ్తాం. లోక్‌సభ స్పీకర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఇవాళ హస్తినకు వెళ్తున్నా. ఈ పర్యటనకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదు’ అని రేవంత్ వివరించారు.

News November 25, 2024

రాజ్యాంగబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు: సీఎం

image

TG: రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి తెలంగాణలో పెట్టుబడులు స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రూల్స్ ప్రకారమే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామన్నారు. దేశంలోని ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందన్నారు. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. చట్టబద్ధంగా ఉన్న సంస్థల నుంచే తాము కూడా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

News November 25, 2024

IPL మెగా వేలం రెండో రోజు ప్రారంభం

image

సౌదీలోని జెడ్డాలో IPL మెగా వేలం రెండో రోజు ప్రారంభమైంది. తొలి రోజు వేలంలో 72మంది ప్లేయర్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. వారిలో 24 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. ఆటగాళ్ల కోసం జట్ల యాజమాన్యాలు ₹467.95 కోట్లు ఖర్చు చేయగా, పంత్‌ను LSG రూ.27కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. jiocinema, StarSportsలో ఆక్షన్ లైవ్ చూడొచ్చు.