News November 25, 2024

పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు గుడ్ న్యూస్

image

TG: పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడే అంశాలపై ‘జనరల్ స్టడీస్ ఫర్ ఆల్’ పేరుతో టీ-సాట్ ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల పాఠ్యాంశాలపై ఇవాళ్టి నుంచి 5 నెలల పాటు 600 ఎపిసోడ్‌లు ప్రసారం చేయనున్నట్లు టీ-సాట్ సీఈవో వేణుగోపాల్ తెలిపారు. టీ-సాట్ నిపుణ ఛానల్‌లో మ.12-1 గంటల వరకు, మ.3-4 గంటల వరకు, విద్య ఛానల్‌లో రా.8-10 గంటల వరకు టెలికాస్ట్ ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News November 25, 2024

ఆకాశ్‌దీప్‌ను దక్కించుకున్న LSG

image

భారత బౌలర్ ఆకాశ్‌దీప్‌ను లక్నో చేజిక్కించుకుంది. అతడిని వేలంలో రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఫెర్గుసన్‌ను పంజాబ్ రూ.2 కోట్లకు దక్కించుకుంది. అఫ్గాన్ ప్లేయర్ ముజీబుర్ రెహ్మాన్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.

News November 25, 2024

ఢిల్లీకి ఎందుకు పోతున్నవో.. ఎవరికి తెలుసు: కేటీఆర్

image

TG: నిధుల కోసమే ఢిల్లీకి వెళ్తున్నానన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘పెళ్లికి పోతున్నవో, సావుకు పోతున్నవో.. ఎవరికి తెలుసు. 28 సార్లు ఢిల్లీ వెళ్లి రూ.28 కూడా తీసుకురాలేదు. బడే బాయ్, చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసు?. మేం నీలాగా ఢిల్లీ గులాములం కాదు. పోరాటం మా రక్తంలోనే ఉంది. మా జెండా, ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధే’ అని ఆయన ట్వీట్ చేశారు.

News November 25, 2024

అధికారులను ప్రశ్నించిన జస్టిస్ పీసీఘోష్ కమిషన్

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా జస్టిస్ పీసీఘోష్ కమిషన్ మేడిగడ్డ ఏఈఈ, డీఈలను విచారించింది. నిర్మాణం, పనుల వివరాలపై ఆరా తీసింది. క్షేత్రస్థాయి పనుల రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్న కమిషన్, పనులపై ప్లేస్‌మెంట్ రికార్డులను అడిగి తెలుసుకుంది. ప్రాజెక్టు DPR, అనుమతులు సహా పలు అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం.