News November 25, 2024
మహారాష్ట్ర CM: రీసెంట్ ట్రెండ్ ఏం చెబుతోందంటే..
మీడియాకు అందని విధంగా CMలను ఎంపిక చేయడం BJP స్పెషాలిటీ. రీసెంటు ట్రెండ్ ఇదే చెప్తోంది. ఉత్తరాఖండ్‌లో పుష్కర్ సింగ్ ధామి, రాజస్థాన్‌లో భజన్‌లాల్, ఒడిశాలో మోహన్ చరణ్, మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్, హరియాణాలో నాయబ్ సైనీని ఇలాగే ఎంపిక చేశారు. ఆయా రాష్ట్రాల్లో గెలిచినప్పుడు వసుంధర రాజె, మనోహర్‌లాల్, శివరాజ్ సింగ్ పేర్లపై మీడియాలో చర్చ జరగ్గా మంత్రులు, MLA పదవుల్లో లేనివారినీ ఎంపికచేసి BJP షాకిచ్చింది.
Similar News
News November 25, 2024
మరో పేసర్‌ను కొన్న MI
ముంబై ఇండియన్స్ మరో పేసర్‌ను కొనుగోలు చేసింది. CSK మాజీ ప్లేయర్ దీపక్ చాహర్‌ను వేలంలో రూ.9.25 కోట్లకు సొంతం చేసుకుంది. మరోవైపు ముకేశ్ కుమార్‌ను రైట్ టు మ్యాచ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ముకేశ్ కోసం పంజాబ్ అత్యధిక బిడ్ దాఖలు చేయగా, RTM పద్ధతిలో DC రూ.8 కోట్లకు అతడిని దక్కించుకుంది.
News November 25, 2024
భువనేశ్వర్‌కు జాక్ పాట్.. ఏ జట్టు కంటే?
ఐపీఎల్ మెగా వేలంలో టీమ్ ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు జాక్ పాట్ తగిలింది. రూ.10.75 కోట్లకు ఆర్సీబీ అతడిని దక్కించుకుంది. తొలి నుంచి లక్నో, ముంబై జట్లు భువీ కోసం పోటీపడ్డాయి. కానీ చివర్లో అనూహ్యంగా ఆర్సీబీ రేసులోకి వచ్చి అతడిని ఎగరేసుకుపోయింది.
News November 25, 2024
విదేశీ మారకం: RBI Gold Strategy
FIIల డిజిన్వెస్ట్‌మెంట్‌తో తరుగుతున్న విదేశీ మారక నిల్వల సమతుల్యం కోసం RBI భారీగా బంగారం కొనుగోలు చేస్తోంది. ఇటీవల 44.76 టన్నుల గోల్డ్ కొనడం ద్వారా నిల్వలు 866 టన్నులకు చేరుకున్నాయి. ఏప్రిల్-నవంబర్ మధ్య విదేశీ కరెన్సీ ఆస్తులు $1.1 బిలియన్ల మేర తగ్గినప్పటికీ, బంగారం నిల్వల విలువ $13 బిలియన్ల మేర పెరిగింది. మొత్తం విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం $658 బిలియన్లుగా ఉన్నాయి.