News November 25, 2024

28న ఓటీటీలోకి ‘లక్కీ భాస్కర్’

image

వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో దుల్కర్ సల్మాన్-మీనాక్షి చౌదరి నటించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ నెల 28 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. గత నెల 31న విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Similar News

News November 25, 2024

ఓనర్ లేకుండా షాప్స్.. ఏవైనా తీసుకోవచ్చు!

image

రోడ్డు వెంబడి దుకాణాలున్నా అందులో ఒక్కరూ కనిపించరు. మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు. ఇలాంటి ప్లేస్ ఎక్కడుందని అనుకుంటున్నారా? మిజోరంలోని సెలింగ్ హైవే వెంబడి ఇలాంటి అనేక షాప్స్ ఉన్నాయి. షాప్స్‌లో ఉన్న వస్తువులను మీరు తీసుకొని డబ్బులను అక్కడే ఉన్న డబ్బాలో వేస్తే సరిపోతుంది. అక్కడి ప్రజలు ఇతరులపై ఎంతో విశ్వాసం కలిగి ఉండటమే దీనికి కారణం. దీనిని ‘నఘా లౌ డావర్ కల్చర్ ఆఫ్ మిజోరం’ అని పిలుస్తారు.

News November 25, 2024

ఆకాశ్‌దీప్‌ను దక్కించుకున్న LSG

image

భారత బౌలర్ ఆకాశ్‌దీప్‌ను లక్నో చేజిక్కించుకుంది. అతడిని వేలంలో రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఫెర్గుసన్‌ను పంజాబ్ రూ.2 కోట్లకు దక్కించుకుంది. అఫ్గాన్ ప్లేయర్ ముజీబుర్ రెహ్మాన్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.

News November 25, 2024

ఢిల్లీకి ఎందుకు పోతున్నవో.. ఎవరికి తెలుసు: కేటీఆర్

image

TG: నిధుల కోసమే ఢిల్లీకి వెళ్తున్నానన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘పెళ్లికి పోతున్నవో, సావుకు పోతున్నవో.. ఎవరికి తెలుసు. 28 సార్లు ఢిల్లీ వెళ్లి రూ.28 కూడా తీసుకురాలేదు. బడే బాయ్, చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసు?. మేం నీలాగా ఢిల్లీ గులాములం కాదు. పోరాటం మా రక్తంలోనే ఉంది. మా జెండా, ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధే’ అని ఆయన ట్వీట్ చేశారు.