News November 25, 2024
లగచర్లకు రేవంత్ వెళ్లుంటే ఉరికించి కొట్టేవారు: KTR
TG: ఫార్మా విలేజ్ కోసం 3వేల ఎకరాల భూములు తీసుకుంటామంటే లగచర్ల గిరిజన రైతులు సీఎం రేవంత్ మీద తిరగబడ్డారని KTR అన్నారు. 9 నెలలుగా నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడటానికి సమయం లేదా అని సీఎంను ప్రశ్నించారు. లగచర్లకు అధికారులు వెళ్తే వ్యతిరేకించారని, అదే రేవంత్ వెళ్లుంటే ఉరికించి కొట్టేవారని చెప్పారు. అదానీ, అల్లుడు, తమ్ముడు, అన్న కోసం రేవంత్ పని చేస్తున్నారని మహబూబాబాద్‌లో ఫైరయ్యారు.
Similar News
News November 25, 2024
ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. లోక్‌సభ స్పీకర్ కుమార్తె వివాహ వేడుకలో ఆయన పాల్గొంటారు. అలాగే కాంగ్రెస్ అధిష్ఠానంతోనూ రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రానికి అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు వద్దని కొద్దిసేపటి క్రితం రేవంత్ ప్రకటించారు. ఈమేరకు అదానీకి లేఖ రాశారు.
News November 25, 2024
సంచలనం.. T20Iలో ఏడు పరుగులకు ఆలౌట్
అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం నమోదైంది. EC2026 ఆఫ్రికా సబ్ రీజియన్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా నైజీరియాతో మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ 7 పరుగులకే ఆలౌటైంది. T20Iలలో ఇదే అత్యల్ప స్కోర్. తొలుత నైజీరియా 271/4 స్కోర్ చేయగా, ఐవరీ కోస్ట్ 7.3 ఓవర్లలో 7 పరుగులకే కుప్పకూలింది. ఆరుగురు డకౌట్లు కాగా, ముగ్గురు ఒక్కో పరుగు చేశారు. ఓపెనర్ మహ్మద్ 4 రన్స్ చేశారు. గతంలో మంగోలియా 10రన్స్‌కే(vsసింగపూర్) ఆలౌటైంది.
News November 25, 2024
మంత్రి లోకేశ్‌తో చాగంటి భేటీ
AP: విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా నియమితులైన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మంత్రి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. మహిళలు, పెద్దలు, గురువులపై విద్యార్థుల్లో గౌరవం పెంపొందించేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని ఈ సందర్భంగా ఇరువురు నిర్ణయించినట్లు లోకేశ్ తెలిపారు. ఇందుకు తనవంతు సలహాలు, సహకారం అందిస్తానని చాగంటి కోటేశ్వరరావు చెప్పారు.