News November 25, 2024
శ్రీశైలంలో గుండెపోటుతో అనంత జిల్లా భక్తుడి మృతి

శ్రీశైలంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లికి చెందిన మల్లికార్జున(56) అనే భక్తుడు సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. మల్లన్న దర్శనానికి వచ్చిన ఆయన కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పిస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తోటి భక్తులు తెలిపారు. దేవస్థానం అధికారులు, పోలీసులు పరిశీలించి, మృతుడి బంధువులకు సమాచారం అందించారు.
Similar News
News March 2, 2026
ఇంటర్ ఫస్టియర్ గణితం పరీక్షలకు 408 మంది గైర్హాజరు

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గణితం పరీక్ష జరిగింది. పరీక్షలకు సెట్-1 ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయుడు తెలిపారు. జనరల్ విద్యార్థులు 13,890 గాను 13,621 మంది హాజరు కాగా 269 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్ విద్యార్థులు 2,258 గాను 2,119 మంది హాజరు కాగా 139 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
News March 2, 2026
ఉగాది నాటికి 16,702 ఇళ్ల పూర్తి లక్ష్యం సాధించాలి: జేసీ

అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఉగాది నాటికి జిల్లాకు కేటాయించిన 16,702 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం ఆవాస్ యోజన 2.0 కింద మంజూరైన ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలన్నారు. ఎన్ఆర్ఈజీఏ బిల్లుల అప్లోడ్, స్వామిత్వం, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, సీసీ రోడ్లు, డ్రైన్ల పనుల్లో పురోగతి సాధించాలని సూచించారు.
News March 2, 2026
అగ్నిప్రమాదం సంభవిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయండి!

వేసవి సమయం సమీపిస్తున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. అనంతపురం, శింగనమల, రాప్తాడు: 08554 220299, తాడిపత్రి: 08554 222299, కళ్యాణదుర్గం: 08497-220101, 08497-287101, ఉరవకొండ: 08556-257099, గుంతకల్లు: 08552-226299కు ఫోన్ చేయవచ్చన్నారు.


