News November 25, 2024
రోహిత్, అశ్విన్, షమీ లేకున్నా హిస్టారిక్ విన్
BGT తొలి టెస్టులో భారత్ చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ, గిల్, అశ్విన్, జడేజా, షమీ జట్టులో లేకపోయినా ప్రత్యర్థి భరతం పట్టింది. రన్స్ పరంగా (295) ఆసిస్‌పై టీమ్ ఇండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం. 2003లో ఆడిలైడ్, 2008లో పెర్త్ విజయాలతో పోలిస్తే ఈ గెలుపు మరపురానిది. తొలి మ్యాచ్‌లోనే కంగారు జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిన టీమ్‌ఇండియా ఆసిస్ మాజీ క్రికెటర్ల కలలను కల్లలు చేసింది.
Similar News
News November 25, 2024
తెలుగు క్రికెటర్‌ను దక్కించుకున్న సీఎస్కే
ఐపీఎల్ మెగా వేలంలో ఏపీలోని గుంటూరు జిల్లా క్రికెటర్ షేక్ రషీద్‌ను చెన్నై కొనుగోలు చేసింది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కే అతడిని దక్కించుకుంది. మరో తెలుగు ఆటగాడు అవనీశ్ ఆరవెల్లి అన్‌సోల్డ్‌గా మిగిలారు. ఆయనను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అన్షుల్ కాంభోజ్‌ను సీఎస్కే రూ.3.40 కోట్లకు సొంతం చేసుకుంది.
News November 25, 2024
అన్‌సోల్డ్‌గా మిగిలిన విదేశీ ఆటగాళ్లు వీరే
ఐపీఎల్ మెగా వేలంలో విదేశీ ప్లేయర్లు బెన్ డకెట్, డెవాల్డ్ బ్రెవిస్, మొయిన్ అలీ, ఫిన్ అలెన్ అన్‌సోల్డ్‌గా మిగిలారు. విల్ జాక్స్‌ను ముంబై ఇండియన్స్ రూ.5.25 కోట్లు చెల్లించి కైవసం చేసుకుంది. టిమ్ డేవిడ్‌ను ఆర్సీబీ రూ.3 కోట్లతో సొంతం చేసుకుంది. షాబాజ్ అహ్మద్‌ను రూ.2.40 కోట్లకు LSG దక్కించుకుంది. దీపక్ హుడాను రూ.1.70 కోట్లు చెల్లించి సీఎస్కే తీసుకుంది.
News November 25, 2024
ఉద్యోగం నుంచి తొలగించినందుకు పరిహారం చెల్లించాలన్న కోర్టు!
చైనాకు చెందిన ఓ కెమికల్ కంపెనీలో పనిచేసే జాంగ్ అనే ఉద్యోగి ఆఫీసులో పడుకున్నాడని యాజమాన్యం అతణ్ని తొలగించింది. దీంతో అతను కోర్టును ఆశ్రయించారు. అతను 20 ఏళ్లుగా మంచి పనితీరు కనబరిచారని, ముందు రోజు ఆఫీసులో లేట్ అవడంతో పడుకున్నట్లు కోర్టు గుర్తించింది. ఈక్రమంలో అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు జాంగ్‌కు కంపెనీ 3,50,000 యువాన్‌లు(రూ.40.7 లక్షలు) పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.