News November 25, 2024
మీలా పైరవీలు చేయడానికి ఢిల్లీ వెళ్లడంలేదు: రేవంత్
TG: తాను తరచూ ఢిల్లీ వెళ్తానంటూ కేటీఆర్ చేస్తున్న విమర్శలకు CM రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘మీలా పైరవీలు చేయడానికి, బెయిల్ కోసం నేను వెళ్లడంలేదు. కేంద్రాన్ని కలిసి మనకు రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికే వెళ్లా. అవసరమైతే ఎన్నిసార్లైనా వెళ్తాం. లోక్‌సభ స్పీకర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఇవాళ హస్తినకు వెళ్తున్నా. ఈ పర్యటనకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదు’ అని రేవంత్ వివరించారు.
Similar News
News November 25, 2024
PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?
APలో ఉమ్మడి తూ.గో-ప.గో, గుంటూరు-కృష్ణా జిల్లాల్లో గ్రాడ్యుయేట్ MLC, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ, తూ.గో-ప.గో జిల్లాల టీచర్స్ MLC ఎన్నికల డ్రాఫ్ట్ రోల్స్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అన్ని పత్రాలు సమర్పించిన వారి పేర్లను లిస్టులో ఉంచారు. మీ నియోజకవర్గం ఎంపిక చేసుకుని, జిల్లా, పోలింగ్ బూత్ వివరాల ద్వారా మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీ పేరు తెలుసుకునేందుకు ఇక్కడ <
News November 25, 2024
పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు: పవన్ కళ్యాణ్
APలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ పలువురు మంత్రుల భేటీలో అధికారులను ఆదేశించారు. వారసత్వ ప్రాంతాలను కాపాడాలన్నారు. ఆలయాల పవిత్రత కాపాడేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. పర్యాటక ప్రాంతాల విశిష్టత తెలిసేలా ప్రచారాలు ఉండాలని, పర్యాటక అభివృద్ధితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధి చెందాలన్నారు.
News November 25, 2024
సెన్సెక్స్, నిఫ్టీలో అక్కడ Strong Resistance
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలను ఆర్జించినా Day Highని అధిగమించలేదు. సెన్సెక్స్‌లో 80,470 వద్ద, నిఫ్టీలో 24,350 వద్ద ఉన్న Strong Resistance వల్ల సూచీలు Consolidation Zoneలోనే పయనించాయి. ఉదయం 2 సూచీల్లో Pre-Open Marketలో భారీగా బిజినెస్ జరిగింది. ఆ లాభాలు మినహా ఈరోజు ప్రత్యేకించి సూచీలు సాధించింది ఏమీ లేదనే చెప్పాలి. ఉదయం ట్రేడింగ్ Open అయిన స్థాయిలోనే చివరికి Close అయ్యాయి.