News November 25, 2024
IPL: అప్పుడు రూ.18.50 కోట్లు.. ఇప్పుడు రూ.2.40 కోట్లు

ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ సామ్ కరన్ షాకింగ్ ధర పలికారు. రూ.2.40 కోట్లకే అతడిని CSK చేజిక్కించుకుంది. కాగా కరన్‌ను గతంలో పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ టీ20 కెప్టెన్ రోవ్‌మన్ పావెల్‌ను రూ.1.50 కోట్లు చెల్లించి KKR దక్కించుకుంది. డుప్లెసిస్‌ను రూ.2 కోట్లకు DC కైవసం చేసుకుంది. వాషింగ్టన్ సుందర్‌ను రూ.3.20 కోట్లతో GT చేజిక్కించుకుంది.
Similar News
News January 3, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 03, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:47 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:18 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:11 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 3, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 03, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:47 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:18 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:11 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 3, 2026
ఫిబ్రవరిలో మున్సి‘పోల్స్’: మంత్రి అడ్లూరి

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నెలాఖరుకల్లా నోటిఫికేషన్ రావొచ్చని అసెంబ్లీలో చిట్ చాట్‌లో ఆయన వెల్లడించారు. మరోవైపు ఫిబ్రవరి 3వ తేదీన జడ్చర్ల నుంచే సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ప్రారంభమవుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పారు. జడ్చర్లలో ట్రిపుల్ ఐటీకి సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు.


