News November 25, 2024
WTC: మళ్లీ భారత్ నంబర్-1
తొలి టెస్టులో ఆసీస్‌పై ఘన విజయంతో భారత్ WTC పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. 9 విజయాలు, 5 ఓటములతో 61.11 శాతంతో టాప్‌లో ఉంది. ఆస్ట్రేలియా(57.69 శాతం) రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత వరుసగా శ్రీలంక(55.56%), కివీస్(54.55%), సౌతాఫ్రికా(54.17%), ఇంగ్లండ్(40.79%), పాక్(33.33%), బంగ్లాదేశ్(27.50%), విండీస్(18.52%) ఉన్నాయి.
Similar News
News November 25, 2024
ఇది కదా విజయం అంటే..!
లక్ష్య ఛేదనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగితే ఫలితం దక్కుతుందన్న మాటలను డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిరూపించారు. ‘2004లో గోవాలో IFFIల ఈవెంట్ మేనేజ్మెంట్లో నాగ్ పనిచేశారు. సరిగ్గా 20 ఏళ్లకు IFFI పుస్తకంలో ఆయనకు ఓ పేజీ కేటాయించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాలో పంచుకున్నారు. కాగా ‘మహానటి’తో నేషనల్ అవార్డు అందుకున్న ఆయన ‘కల్కి’తో రూ.వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన డైరెక్టర్‌గా చరిత్రలోకెక్కారు.
News November 25, 2024
షాకింగ్: సర్ఫరాజ్ ఖాన్ అన్‌సోల్డ్
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టన్నులకొద్దీ రన్స్ చేసిన సర్ఫరాజ్ ఖాన్‌ను IPL వేలంలో దురదృష్టం వెంటాడింది. స్టార్ హిట్టర్‌గా పేరొంది, ప్రస్తుతం BGTలో భారత జట్టుకూ ఎంపికైన అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. రూ.75 లక్షల బేస్ ప్రైస్‌కు వేలంలోకి వచ్చిన సర్ఫరాజ్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. గతంలో అతడు RCB, పంజాబ్, DC తరఫున ఆడారు. అయితే సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్‌ను పంజాబ్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.
News November 25, 2024
ఇలాంటి జింకలను మీరెప్పుడైనా చూశారా?
జింకల్లో ఎన్నో రకాలున్నాయి. అందులో సైగ జింక అరుదైనది. ఇది కాస్త విచిత్రమైన రూపాన్ని కలిగి ఉంటుంది. మధ్య ఆసియాలోని గడ్డి భూముల్లో కనిపించే సైగ జింకలకు విచిత్రమైన, ఉబ్బెత్తు ముక్కు ఉంటుంది. కాలానుగుణ ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను భరించడంలో ఈ ముక్కు సహాయపడుతుంది. నాసికా రంధ్రాలు గాలి ఫిల్టర్లుగా పనిచేస్తాయి. చల్లటి గాలిని పీల్చుకుని ఊపిరితిత్తులకు చేరేలోపు వేడి చేస్తాయి.