News November 25, 2024
మంత్రి లోకేశ్‌తో చాగంటి భేటీ
AP: విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా నియమితులైన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మంత్రి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. మహిళలు, పెద్దలు, గురువులపై విద్యార్థుల్లో గౌరవం పెంపొందించేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని ఈ సందర్భంగా ఇరువురు నిర్ణయించినట్లు లోకేశ్ తెలిపారు. ఇందుకు తనవంతు సలహాలు, సహకారం అందిస్తానని చాగంటి కోటేశ్వరరావు చెప్పారు.
Similar News
News November 25, 2024
కాసేపట్లో మహారాష్ట్ర ఉత్కంఠకు తెర
మహారాష్ట్ర తదుపరి CM ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. బీజేపీ అధిష్ఠానం తన కసరత్తును ఓ కొలిక్కి తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయమై చర్చించేందుకు మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్ ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి 10.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వీరు సమావేశం కానున్నారు. సీఎం పదవి సహా మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు.
News November 25, 2024
BHUVI: ఆరెంజ్ ఆర్మీ హార్ట్ బ్రేక్!
ఐపీఎల్ వేలంలో టీమ్ ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఆర్సీబీ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. కాగా భువీ ఆర్సీబీకి వెళ్లిపోవడంతో SRH ప్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ‘మిస్ యువర్ గేమ్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కాగా 2013 నుంచి భువనేశ్వర్ SRHకే ఆడుతున్నారు. భువీ టీమ్ ఇండియా జెర్సీలో కంటే ఆరెంజ్ జెర్సీలోనే అందరికీ గుర్తుకొస్తారు. భువీ గతంలో ఆర్సీబీ తరఫున కూడా ఆడిన విషయం తెలిసిందే.
News November 25, 2024
ముంబై ఇండియన్స్‌లోకి మరో తెలుగు కుర్రాడు
ఐపీఎల్ మెగా వేలంలో తెలుగు కుర్రాడు కాకినాడకు చెందిన పెన్మత్స వెంకట సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కే ఆయనను సొంతం చేసుకుంది. ఇప్పటికే ముంబై జట్టులో హైదరాబాదీ తిలక్ వర్మ ఉన్న సంగతి తెలిసిందే. కాగా వైజాగ్‌కు చెందిన అవినాశ్‌ను రూ.30 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే బైలపూడి యశ్వంత్, విజయ్ కుమార్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.