News November 25, 2024
సంచలనం.. T20Iలో ఏడు పరుగులకు ఆలౌట్

అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం నమోదైంది. EC2026 ఆఫ్రికా సబ్ రీజియన్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా నైజీరియాతో మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ 7 పరుగులకే ఆలౌటైంది. T20Iలలో ఇదే అత్యల్ప స్కోర్. తొలుత నైజీరియా 271/4 స్కోర్ చేయగా, ఐవరీ కోస్ట్ 7.3 ఓవర్లలో 7 పరుగులకే కుప్పకూలింది. ఆరుగురు డకౌట్లు కాగా, ముగ్గురు ఒక్కో పరుగు చేశారు. ఓపెనర్ మహ్మద్ 4 రన్స్ చేశారు. గతంలో మంగోలియా 10రన్స్‌కే(vsసింగపూర్) ఆలౌటైంది.
Similar News
News January 28, 2026
మిరపలో నల్ల తామర పురుగుల నివారణ ఎలా?

మిరపలో నల్ల తామర పురుగుల తీవ్రతను బట్టి ఎకరానికి 25కు పైగా నీలి రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బవేరియా బస్సియానా 5 గ్రాములు లేదా స్పైనటోరం 0.9ml మందును లేదా ఫిప్రోనిల్ 5% ఎస్.సి 2ML లేదా స్పైనోసాడ్ 45% ఎస్.సి 0.3MLలలో ఏదో ఒకదానిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు ఉద్ధృతిని బట్టి ఈ మందులను మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 28, 2026
రాష్ట్రానికి రూ.13 వేల కోట్లు

AP: జల్‌జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి భారీగా నిధులు రానున్నాయి. గతంలో ఆగిపోయిన సుమారు రూ.23 వేల కోట్ల పనులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో కేంద్ర వాటాగా రూ.13 వేల కోట్లు విడుదల కానున్నాయి. 2027 నాటికి ప్రతి ఇంటికీ సురక్షిత కుళాయి నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ కేంద్రంతో చర్చలు జరపడంతో నిధుల విడుదలకు లైన్ క్లియరైంది.
News January 28, 2026
ముడతలు, మచ్చలు తగ్గించే ఎగ్ ఫేస్ ప్యాక్

వయసు పెరిగే కొద్దీ చర్మంపై మచ్చలు ముడతలు వస్తుంటాయి. వీటిని తొలగించడంలో ఎగ్ ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఒక ఎగ్ వైట్, కలబంద గుజ్జు, పంచదార పొడి బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే ముఖం అందంగా మెరిసిపోతుంది.


